iDreamPost
android-app
ios-app

నానికి కొత్త కథే.. నాగచైతన్యకి పాతదా?

  • Author ajaykrishna Published - 02:12 PM, Tue - 3 October 23
  • Author ajaykrishna Published - 02:12 PM, Tue - 3 October 23
నానికి కొత్త కథే.. నాగచైతన్యకి పాతదా?

ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథలు ఒక్కోసారి వేరే హీరోలతో తెరపైకి వస్తుంటాయి. ఇది రెగ్యులర్ గా జరిగేదే. ఎందుకంటే.. దర్శకనిర్మాతలు అనుకున్న కథ.. ఆయా హీరోలు బిజీ ఉండటమో లేక కథ నచ్చకనో వేరే హీరోల వద్దకు వెళ్తుంటాయి. ఒకవేళ ముందుగా అనుకున్న హీరో కాకుండా.. వేరే హీరోతో సినిమా తీసి హిట్ కొట్టేశారంటే ఆ ప్రభావం ముందు రిజెక్ట్ చేసిన హీరోపై పడుతుంది. అదే సినిమా ప్లాప్ అయ్యిందంటే.. ముందు హీరో వదిలేసి మంచి పని చేశాడని మాట్లాడుకుంటారు. ఇవన్నీ స్టార్ హీరోల నుండి యంగ్ స్టర్స్ వరకు జరుగుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

అదేంటంటే.. ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో మాస్ రాజా రవితేజ తర్వాత నేచురల్ స్టార్ నాని ఉంటాడు. కథ బాగుంటే.. సీనియర్ దర్శకుడా లేక డెబ్యూనా అని చూడరు. అవకాశాలు ఇస్తూ.. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తుంటారు. రవితేజ తర్వాత నానినే కొత్త వాళ్ళతో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది దసరాతో సూపర్ హిట్ కొట్టి.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన నాని.. ఇప్పుడు హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు. హాయ్ నాన్న డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా.. ఇప్పుడు నాని మరో యంగ్ డెబ్యూ డైరెక్టర్ కథను ఓకే చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి డైరెక్టర్ ఎవరు అనేది తెలియలేదు. కానీ.. ఆ కథ ఆల్రెడీ వేరే హీరో విన్నదే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సరే డైరెక్టర్ ఎవరో తెలియదుగా.. నాని కంటే ముందు కథ విన్న ఆ హీరో ఎవరో తెలుసా? అనంటే.. నాగచైతన్య అని తెలుస్తుంది. నాగచైతన్య ఆల్రెడీ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విన్నాడట. మరి ఏమైందో గానీ అది ఓకే కాకపోవడంతో.. అదే డైరెక్టర్ తన కథను నానికి చెప్పాలని భావిస్తున్నాడని సమాచారం. మరి ఆ డైరెక్టర్ నానికి చెప్పాలనుకున్న కథ.. నాగచైతన్య విన్నదేనా? లేక వేరేనా.. అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ చైతూకి చెప్పిన కథే అయితే.. అది నానికి మాత్రమే కొత్త కథ అవుతుందని టాక్. మరి నాని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetewin girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel