iDreamPost
android-app
ios-app

Devara: రిలీజ్ కు నెల రోజుల ముందే US మార్కెట్ ను షేక్ చేస్తున్న ‘దేవర’! ఇది సర్ NTR రేంజ్..

  • Published Aug 31, 2024 | 10:08 AM Updated Updated Aug 31, 2024 | 11:18 AM

Jr NTR, Devara pre-sales in the US: యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీ రిలీజ్ కు నెల రోజుల ముందే యూస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దాంతో ఇది సర్ మా తారక్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Jr NTR, Devara pre-sales in the US: యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీ రిలీజ్ కు నెల రోజుల ముందే యూస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దాంతో ఇది సర్ మా తారక్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Published Aug 31, 2024 | 10:08 AMUpdated Aug 31, 2024 | 11:18 AM
Devara: రిలీజ్ కు నెల రోజుల ముందే US మార్కెట్ ను షేక్ చేస్తున్న ‘దేవర’! ఇది సర్ NTR రేంజ్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అదీకాక విడులైన ప్రమోషనల్ కంటెంట్ ఆ హైప్ ను వేరే రేంజ్ కు తీసుకెళ్లింది. ఇక దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూసే సినిమాల లిస్ట్ లో దేవర టాప్ లో ఉంది. ఇదిలా ఉండగా.. దేవర రిలీజ్ కు నెల రోజుల ముందే యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు యంగ్ టైగర్. దాంతో ఇది సర్ మా హీరో రేంజ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

‘దేవర’.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్, ఫ్యాన్స్ లో సినిమా స్పీడ్ గా చూడాలన్న క్యూరియాసిటీని పెంచేశాయి. ఒక్కో అప్డేట్ ఇస్తూ.. మేకర్స్ సైతం మూవీపై బజ్ ను ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దేవరకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. యూఎస్ మార్కెట్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయినట్లు సమాచారం. ఈ ప్రీ సేల్స్ లో దేవర దుమ్మురేపుతున్నాడు. బుకింగ్స్ ఓపెన్ చేసిన ఏరియాల్లో గంటలోనే 80 వేలకి పైగా డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. 19 లోకేషన్లలో 52 షోలు వేయనున్నారు. ఇదే స్పీడ్ తో $100K  దిశగా దూసుకెళ్తున్నాడు దేవర.

Devara

అయితే.. దాదాపు దేవర రిలీజ్ కు ఇంకా నెల టైమ్ ఉండగానే బుకింగ్స్ లో ఈ రేంజ్ లో టికెట్లు తెగడం విశేషం. దీన్ని బట్టే అర్థం అవుతోంది దేవర కోసం అభిమానులు ఏ లెవల్లో వేచిచూస్తున్నారో. ప్రీ సేల్స్ లో దేవర మాస్ బ్యాటింగ్ కు యూఎస్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది. దాంతో ఇది సర్ మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ కాలర్ ఎగరేస్తూ.. ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులు దేవర బద్దలు కొడతాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా.. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర రిలీజ్ అవ్వబోతోంది. మరి విడుదలకు నెలరోజుల ముందే యూఎస్ మార్కెట్ ను షేక్ చేస్తున్న తారక్ స్టామినాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkazan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş