iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మూవీ షూట్ స్టార్ట్! పోస్ట్ వైరల్!

  • Published Jul 27, 2024 | 6:13 PM Updated Updated Jul 27, 2024 | 6:13 PM

Mokshagna Viral Post On His Debut Movie With Prashant Varma: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ రంగ ప్రవేశానికి రెడీ అయిపోయాడు. ప్రశాంత్ వర్మతో తాను చేయబోయే సినిమా షూట్ కూడా స్టార్ట్ అయిపోయినట్లు.. హైప్ ఇచ్చేలా ఒక పోస్ట్ చేశాడు.

Mokshagna Viral Post On His Debut Movie With Prashant Varma: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ రంగ ప్రవేశానికి రెడీ అయిపోయాడు. ప్రశాంత్ వర్మతో తాను చేయబోయే సినిమా షూట్ కూడా స్టార్ట్ అయిపోయినట్లు.. హైప్ ఇచ్చేలా ఒక పోస్ట్ చేశాడు.

  • Published Jul 27, 2024 | 6:13 PMUpdated Jul 27, 2024 | 6:13 PM
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మూవీ షూట్ స్టార్ట్! పోస్ట్ వైరల్!

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగు ప్రేక్షకులు మరో ఎంట్రీ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అది మరెవరో కాదు.. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ గురించే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఊహాగానాలు, అంచనాలు వచ్చాయి. స్వయంగా బాలకృష్ణ తన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ని తన కుమారుడితో తీస్తాను అని అన్నారు. అయితే అది ఇప్పుడల్లా అయ్యేలా కనిపించడం లేదు. అందుకే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించారు. మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ మూవీపై ఇప్పటికే చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా మోక్షజ్ఞే మూవీ గురించి స్పందించాడు.

టాలీవుడ్ లో మరో స్టార్ కిడ్ రంగ ప్రవేశానికి సర్వ సిద్ధమైంది. మోక్షజ్ఞ గ్రాండ్ గా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ అందుకు తగినట్లుగా పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నాడు. హనుమాన్ తో తన స్టామినా ఏంటో పాన్ ఇండియా ప్రేక్షకులకే కాకుండా.. మేకర్స్ కి కూడా తెలిసొచ్చేలా చేశాడు. ఇప్పుడు మోక్షజ్ఞ బాధ్యతను తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ, కథ వంటి విషయాలకు సంబంధించి కేవలం గాసిప్స్ మాత్రమే వచ్చాయి. ఎక్కడా కూడా అధికారిక వార్తలు రాలేదు. కానీ, మోక్షజ్ఞ స్వయంగా ఈ ప్రాజెక్ట్ పై స్పందించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై బజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు.

డెబ్యూకి సంబంధించి ఇదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఒక ఫొటో షేర్ చేసి అందరి ఆశీర్వాదాలు కావాలి అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సినిమాకి సంబంధించి రెస్పాండ్ అయ్యాడు. మోక్షజ్ఞ తేజ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్ షాట్ బ్లాస్ట్.. అదిరిపోయింది అనే అర్థం వచ్చేలా హైఫై, ప్లాస్ట్, ఫైర్ ఏమోజీలు పెట్టాడు. అలాగే స్టోరీ ఎలివేషన్స్, హై మూమెంట్స్ అంటూ మరో ఫైర్ ఏమోజీ పెట్టాడు. ఇంక ఈ మూవీ మీ అంచనాలకు మించి పోతుంది అంటూ చెప్పేశాడు. ఈ పోస్ట్ లో ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేశాడు. అయితే ఇది మోక్షజ్ఞ అధికారిక ఖాతానేనా కాదా అనేది కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? కథ ఎలా ఉండబోతోంది అంటూ అడుగుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet