iDreamPost
android-app
ios-app

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ మూవీ అప్ డేట్ వచ్చేసింది..

  • Published Sep 06, 2024 | 11:25 AM Updated Updated Sep 06, 2024 | 11:36 AM

Mokshagna Entry With Director Prasanth Varma: నందమూరి బాలకృష్ణ వారసుడు ... ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెల్సిందే. ఎప్పటినుంచో దీనికి సంబంధించిన వార్తలు వస్తూ ఉండగా.. తాజాగా ఈ విషయంపైన క్లారిటీ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Mokshagna Entry With Director Prasanth Varma: నందమూరి బాలకృష్ణ వారసుడు ... ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెల్సిందే. ఎప్పటినుంచో దీనికి సంబంధించిన వార్తలు వస్తూ ఉండగా.. తాజాగా ఈ విషయంపైన క్లారిటీ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 06, 2024 | 11:25 AMUpdated Sep 06, 2024 | 11:36 AM
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ మూవీ అప్ డేట్ వచ్చేసింది..

ఇండస్ట్రీలో కొత్త తరం మొదలైంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హీరోలతో పాటు.. వారి వారసులు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒకరిద్దరు యంగ్ హీరోలు డెబ్యూ సినిమాలతో ప్రేక్షకులలో మంచి బజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించడం.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వంతు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ తనయుడు… అంటే ఆ రేంజ్ క్రేజ్ ను నిలబెట్టుకుని తీరాలి కాబట్టి మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తూ.. ఎంట్రీ కోసం ఇన్నేళ్ల సమయం తీసుకున్నారు. ఇక తాజాగా ఈ విషయం పై అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చేశారు మేకర్స్. దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వడం కోసం అభిమానులంతా ఎప్పటినుంచో చూస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్దీ రోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ డేట్ కోసం ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంలో అఫీషియల్ అనౌస్మెంట్ వచ్చేసింది. టాలీవుడ్ లో యంగ్ దర్శకుడు.. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. మోక్షజ్ఞ పుట్టిన రోజు సంధర్బంగా.. తనని విష్ చేస్తూ ఓ పోస్టర్ ను రివీల్ చేశారు. కాగా ఈ సినిమాకు.. దసరా నిర్మాణ సంస్థ.. ఎస్ ఎల్ వి సినిమాస్, మోక్షజ్ఞ సోదరి తేజస్విని కలిసి నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.

ప్రశాంత్ వర్మ హనుమాన్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి తెలియనిది కాదు. అప్పటివరకు ప్రశాంత్ వర్మ కొన్ని సినిమాలను తీసినా కానీ.. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన హనుమాన్ తో ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ గ్రాఫ్ పెరిగిందని చెప్పి తీరాలి. ప్రస్తుతం ఈ దర్శకుడి చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి. కాబట్టి ఈసారి మోక్షజ్ఞతో కలిసి ప్రశాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.. మోక్షజ్ఞ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. ఆ అప్ డేట్స్ ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడాల్సిందే. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom