iDreamPost
android-app
ios-app

Balakrishna: బ్లాక్ బస్టర్ రీమేక్ లో బాలయ్య? 20 ఏళ్ల రూల్ బ్రేక్ చేస్తాడా?

  • Published Aug 06, 2024 | 10:32 AM Updated Updated Aug 06, 2024 | 10:32 AM

నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. 20 ఏళ్ల తర్వాత బాలయ్య ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. 20 ఏళ్ల తర్వాత బాలయ్య ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 06, 2024 | 10:32 AMUpdated Aug 06, 2024 | 10:32 AM
Balakrishna: బ్లాక్ బస్టర్ రీమేక్ లో బాలయ్య? 20 ఏళ్ల రూల్ బ్రేక్ చేస్తాడా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కుర్రహీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ.. దూసుకెళ్తున్నాడు. అఖండ మూవీ తర్వాత మూవీల జోరు పెంచాడు బాలయ్య. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ లో బాలకృష్ణ నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తున్నరన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆవేశం’. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సంచలన విషయం సాధించింది. వసూళ్ల పరంగా కూడా రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ మూవీని బాలయ్యతో రీమేక్ చేయాలని రైట్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది. ఇక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు హరీష్ శంకర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రీమేక్ లను అద్భుతంగా తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ సిద్ధహస్తుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే బాలయ్య రీమేక్స్ జోలికి వెళ్లక దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. చివరిసారిగా బాలకృష్ణ నటించిన రీమేక్ మూవీ ‘లక్ష్మీ నరసింహా’. 2004లో జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రీమేక్ ల జోలికి పోలేదు బాలయ్య. అయితే ఆవేశం రీమేక్ లో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి 20 సంవత్సరాల రూల్ ను ఈ రీమేక్ తో బ్రేక్ చేస్తాడా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet