iDreamPost
android-app
ios-app

పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలు శిక్ష!

  • Author Soma Sekhar Published - 07:54 AM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Published - 07:54 AM, Wed - 19 July 23
పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలు శిక్ష!

సాధారణంగా ఏ వ్యక్తిపైనా గానీ, సంస్థ పైనా గానీ సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తే.. సదరు వ్యక్తులు, సంస్థలు వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తారు. ఇలాంటి కేసులు ఎక్కువగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వేస్తుంటారు. తాజాగా పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(ACMM) కోర్డు మంగళవారం ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన విధించింది. 2011లో వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

సినీ నటులు జీవిత, రాజశేఖర్ లకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పరువు నష్టం కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది. దానితో పాటుగా రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. 2011లో జీవిత, రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న బ్లడ్ బ్యాంక్ లో ఉచితంగా రక్తాన్ని సేకరించి మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ.. సినీ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై జీవిత, రాజశేఖర్ అసత్య ఆరోపణలు చేశారంటూ.. పరువు నష్టం దావా వేశారు సినీ నిర్మాత అల్లు అరవింద్. దాంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తుది తీర్పును వెల్లడించింది. కాగా.. జరిమానా చెల్లించడంతో.. అప్పీలుకు అవకాశామిస్తూ జీవిత రాజశేఖర్ దంపతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇదికూడా చదవండి: రష్మిక- విజయ్ దేవరకొండపై తమ్ముడు ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!