iDreamPost
android-app
ios-app

అనన్య నాగళ్ల కొత్త సాంగ్.. హార్ట్ లాక్ అయ్యేలా లిప్ లాక్!

  • Published Jan 19, 2024 | 7:24 PM Updated Updated Jan 19, 2024 | 7:24 PM

Pottel Moive:తొలి ఇండిపెండెంట్ చిత్రం 'బంధం రేగడ్' తో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సాహిత్ మోత్కురి తెరకెక్కించిన మరో చిత్రం పొట్టేల్. ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదలైంది.

Pottel Moive:తొలి ఇండిపెండెంట్ చిత్రం 'బంధం రేగడ్' తో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సాహిత్ మోత్కురి తెరకెక్కించిన మరో చిత్రం పొట్టేల్. ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదలైంది.

  • Published Jan 19, 2024 | 7:24 PMUpdated Jan 19, 2024 | 7:24 PM
అనన్య నాగళ్ల కొత్త సాంగ్.. హార్ట్ లాక్ అయ్యేలా లిప్ లాక్!

మంచి కంటెంట్ తో పాటు మంచి నేపథ్యం ఉంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇదే విషయం అనేక సినిమాల విషయంలో నిరూపించపడింది. కాంతార, బలగం లాంటి కంటెంట్, ఎమోషన్స్ ప్రధానంగా సాగే  సినిమాలను మరో లెవెల్ కు తీసుకెళ్లడమే కాకుండా కాసుల వర్షం కురిపించారు. అలాంటి కోవలోనే వస్తున్నట్టు అనిపిస్తున్న చిత్రం పొట్టేల్. పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా రూపొందినట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి ‘నగిరో నగిరారో’ అనే సాంగ్ విడుదలైంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం పొట్టేల్. ఈ సినిమాకు సాహిత్ మోత్కురి  దర్శకత్వం వహించగా సురేశ్ కుమార్, సడిగే, నిశాంత్ నిర్మాతలుగా ఉన్నారు.  తొలి ఇండిపెండెంట్ చిత్రం ‘బంధం రేగడ్’ తో దర్శకుడు సాహిత్ మోత్కురి విమర్శకుల ప్రశంసలు పొందారు. అలానే తన రెండో చిత్రం ‘సవారీ’ తో బాక్సాఫీస్ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు తన మూడవ చిత్రం పొట్టేల్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుని.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి  ఓ పాట వచ్చింది. ఈ సినిమా నుంచి ‘నగిరో నగిరారో’ అనే పాట విడుదలైంది. ఈ పాటలో లిరిక్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక ఈ పాటలో హీరో, హీరోయిన్ల లిప్ లాక్ సీన్ ఓ రేంజ్ లో ఉంది. పొలం గట్టు మీద హీరో,హీరోయిన్ కూర్చుని రోమాన్స్ లో మునిగి తేలుతారు. ప్రస్తుతం పొట్టేల్ మూవీ నుంచి వచ్చిన ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో ప్రత్యేకం హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రోమాన్స్ సన్నివేశం వేరేలెవెల్ లో ఉంది. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి  విడుదల చేశారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం పొట్టేల్ నుంచి వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom