iDreamPost
android-app
ios-app

Nagarjuna: కూలీ మూవీ.. నాగార్జున అన్ని కోట్ల పారితోషికం తీసుకున్నాడా?

  • Published Aug 30, 2024 | 5:59 PM Updated Updated Aug 30, 2024 | 5:59 PM

Nagarjuna take huge remuneration for Rajinikanth Coolie movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం భారీ మెుత్తంలో నాగ్ రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఎంత తీసుకున్నాడంటే?

Nagarjuna take huge remuneration for Rajinikanth Coolie movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం భారీ మెుత్తంలో నాగ్ రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఎంత తీసుకున్నాడంటే?

  • Published Aug 30, 2024 | 5:59 PMUpdated Aug 30, 2024 | 5:59 PM
Nagarjuna: కూలీ మూవీ.. నాగార్జున అన్ని కోట్ల పారితోషికం తీసుకున్నాడా?

సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో ‘కూలీ’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ న్యూస్ లో నిజం లేదని, ఇది పూర్తిగా కొత్త కథని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ కనిపించబోతోంది. ఇప్పటికే విలక్షణ నటుడు ఉపేంద్ర తో పాటుగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఈ చిత్రంలో భాగమయ్యారు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. స్టైలిష్ విలన్ లుక్ లో కింగ్ అదరగొట్టేశాడు. అయితే అతడు విలన్ గా నటిస్తాడా? లేడా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో కూలీ మూవీకి నాగ్ అందుకున్న పారితోషికానికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కూలీ సినిమాకు నాగ్ ఎన్నికోట్లు తీసుకున్నాడంటే?

అక్కినేని నాగార్జున.. హీరోగా ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క ఇతర హీరోల మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. ధనుష్-శేఖర్ కమ్ముల ‘కుబేర’లొ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దాంతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ చిత్రం ‘కూలీ’లో కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను నాగ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. కూలీ మూవీ కోసం నాగార్జున ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

రజినీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నందుకు గాను ఏకంగా రూ. 24 కోట్ల రెమ్యునరేషన్ ను నాగ్ కు ఇస్తున్నారట. ఆయన కెరీర్ లో అత్యధికంగా రూ. 18 కోట్ల వరకు గతంలో తీసుకున్నారు. కానీ.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కూలీ మూవీలో పాత్ర కోసం ఈ రేంజ్ పారితోషికం తీసుకుంటున్నాడట నాగ్. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. మరి నాగార్జున కూలీ మూవీ కోసం ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş