iDreamPost
android-app
ios-app

రష్మిక ఫేక్‌ వీడియోపై స్పందించిన నాగ చైతన్య!

కొందరు సైబర్‌ నేరగాళ్లు ఆమె ఫేస్‌ను వేరే యువతి బాడీతో కలిపి ఓ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియా తెగ వైరల్‌గా మారింది.

కొందరు సైబర్‌ నేరగాళ్లు ఆమె ఫేస్‌ను వేరే యువతి బాడీతో కలిపి ఓ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియా తెగ వైరల్‌గా మారింది.

రష్మిక ఫేక్‌ వీడియోపై స్పందించిన నాగ చైతన్య!

టెక్నాలజీ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో టెక్నాలజీ దారుణాలకు తెరతీస్తోంది. కొంతమంది దుర్మార్గులు దాన్ని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. నిత్యం కొన్ని వేల మంది మహిళలు టెక్నాలజీ కారణంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు టార్గెట్‌ అవుతున్నారు. తాజాగా, డీప్‌ ఫేక్‌ వీడియో కారణంగా రష్మిక మందన్న మనో వేదనకు గురయ్యే పరిస్థితి వచ్చింది.

కొందరు సైబర్‌ నేరగాళ్లు ఆమె ఫేస్‌ను వేరే యువతి బాడీతో కలిపి ఓ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియా తెగ వైరల్‌గా మారింది. రష్మిక దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై స్పందించిన రష్మిక.. ‘‘ నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై మాట్లాడాలంటే బాధగా ఉంది. ఈ విషయాన్ని కచ్చితంగా షేర్ చేసుకుంటా. టెక్నాలజీని చూస్తుంటే భయమేస్తోంది. టెక్నాలజీ వల్ల అందరం కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఇలాంటి ఘటన కాలేజ్, స్కూల్ రోజుల్లో జరిగితే ఎలా నెగ్గుకొచ్చేదాన్నో? ’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ఈ ఫేక్‌ వీడియోపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. రష్మిక మందన్నను టార్గెట్‌ చేసుకుని విడుదలైన డీప్‌ ఫేక్‌ వీడియో ఆన్‌లైన్‌లోని భయంకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు. సైబర్‌ ప్రమాదాలనుంచి మహిళల్ని రక్షించడానికి అత్యవసర చర్యలు కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి అశ్విన్‌, ఇతరులకు విజ్ఞప్తి చేశారు. కఠిన చర్యలు తీసుకోవటానికి సమయం ఆసన్నం అయిందని అన్నారు.

తాజాగా, టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగ చైతన్య రష్మిక వీడియోపై స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరును చూస్తుంటే నిరుత్సాహంగా ఉంది. భవిష్యత్తులో ఇది దేనికి దారి తీస్తుందో తల్చుకుంటే భయంగా ఉంది. ఇలాంటి వాటిపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. ఘటనల కారణంగా బాధింపబడ్డవారికి.. బాధింపబడకుండా ఉండడానికి కఠిన చట్టాలను తీసుకురావాలి. ధైర్యంగా ఉండూ’’ అని రాసుకొచ్చారు. మరి, రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.