అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకుంది. చైతూ సిరీస్ ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లోకి వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకుంది. చైతూ సిరీస్ ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లోకి వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..
మూవీ మార్కెట్ రోజురోజుకీ మరింత పెరుగుతోంది. థియేట్రికల్ బిజినెస్‌తో పాటు టెలివిజన్ రైట్స్ రూపంలోనూ నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని రాబడుతున్నారు. ఇంకా ఓటీటీల వల్ల సినిమా రిలీజ్‌కు ముందే లాభాలను మూటగట్టుకుంటున్నారు. మేకింగ్‌లో ఉండగానే ఫిల్మ్స్‌ను భారీ ధరకు ఓటీటీలకు అమ్మేయడంతో ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతున్నారు. కరోనా టైమ్ నుంచి ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు థియేటర్లో ఫెయిలైనా.. ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్‌తో అదరగొడుతున్నాయి. ఓటీటీలకు ఉన్న ఆదరణను చూసి అటు వైపు ఎంట్రీ ఇచ్చేందుకు హీరోహీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మంచి స్టోరీ, స్క్రీన్‌ప్లేతో వస్తే ఓటీటీల్లో మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లు చేసేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు స్టార్స్. ఇప్పటికే చాలా మంది స్టార్లు డిజిటల్ ప్లాట్ఫామ్లో కనిపించారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మరో టాలీవుడ్ హీరో రెడీ అయిపోయారు. ఆయనే అక్కినేని వారసుడు నాగచైతన్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దూత’. ఈ సిరీస్ గురించి మేకర్స్ అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతున్నా దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం, అప్డేట్స్ లేకుండా పోయాయి. ‘దూత’ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ మాత్రం ఆలస్యం అవుతోంది.
చైతూ డిజిటల్ ఎంట్రీ ఆ రోజే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో డేట్స్ కూడా వినిపించాయి. అయితే ఎట్టకేలకు ‘దూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ సిరీస్ డిసెంబర్ 1వ తేదీ నుంచి తమ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ తెలిపింది. స్టార్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రూపొందించారు. నాగచైతన్య-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో ‘మనం’, థాంక్యూ’ సినిమాలను విక్రమ్ కుమార్ తీశారు. ఇందులో ‘మనం’ మెమరబుల్ హిట్‌గా నిలిచింది. ఇందులో చైతూతో పాటు కింగ్ నాగార్జున, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కూడా యాక్ట్ చేశారు.
ఇక, ‘దూత’ వెబ్ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్లు కీలక పాత్రల్లో నటించారు. 40 నుంచి 50 నిమిషాల మధ్య నిడివితో మొత్తం 8 ఎపిసోడ్స్‌గా ఇది రానుందని తెలుస్తోంది. చైతూ క్యారెక్టర్ చుట్టూ జరుగుతున్న అంతుచిక్కని మరణాల వెనుక ఉన్న సీక్రెట్, వాటి మధ్య ఉన్న కనెక్షన్స్, చనిపోయిన తర్వాత మనుషులు ఆత్మలుగా తిరిగే పద్ధతి ఇవన్నీ ‘దూత’ సిరీస్‌లో విక్రమ్ కే కుమార్ టచ్ చేశారని టాక్. న్యూస్‌లో వచ్చే చావులకు సంబంధించి హెడ్‌లైన్స్‌ను హైలైట్ చేస్తూ ఇచ్చిన డిజైన్, దేని కోసమో వెతుకుతున్నట్లు నాగ చైతన్య ఇచ్చిన స్టిల్ చూస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీల్లో స్ట్రీమింగ్ కానున్న ‘దూత’తో చైతూ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. మరి.. ‘దూత’ సిరీస్ చూసేందుకు మీరెంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రష్మీక ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు! యువకుడిని విచారించిన పోలీసులు
mystery or message? you’ll find out soon enough 👀#DhoothaOnPrime, Dec 1 pic.twitter.com/7vNbKk6Aih
— prime video IN (@PrimeVideoIN) November 15, 2023