iDreamPost

అర్జునుడు vs కర్ణుడు వివాదంపై నాగ్ అశ్విన్ వివరణ! మళ్ళీ లెక్క తప్పాడు!

Nag Ashwin About Arjuna Vs Karna: కల్కి 2898 ఏడీ సినిమాతో జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది.. జీవితంలో మహాభారతం గురించి తెలియని వారు కూడా దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే నాగ్ అశ్విన్ లెక్క తప్పింది. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనే ప్రశ్నకు వివరణ ఇచ్చారు గానీ లెక్క తప్పారు.

Nag Ashwin About Arjuna Vs Karna: కల్కి 2898 ఏడీ సినిమాతో జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది.. జీవితంలో మహాభారతం గురించి తెలియని వారు కూడా దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే నాగ్ అశ్విన్ లెక్క తప్పింది. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనే ప్రశ్నకు వివరణ ఇచ్చారు గానీ లెక్క తప్పారు.

అర్జునుడు vs కర్ణుడు వివాదంపై నాగ్ అశ్విన్ వివరణ! మళ్ళీ లెక్క తప్పాడు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. మన పురాణాల గురించి తెలియని వారితో కూడా ఆ మహాభారత గ్రంథం గురించి తెలుసుకునేలా నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నం మెచ్చుకోతగ్గదే. అయితే కల్కి సినిమాలో కల్కి పాత్రను హైలైట్ చేయడంపై సినిమాపై కొంచెం వ్యతిరేకత అయితే వస్తుంది. అశ్వత్థామ అంటే చిరంజీవి కాబట్టి.. ఆయనకు మరణం లేదు కాబట్టి కల్కి అవతార సమయంలో ఆ భగవంతుడికి మద్దతుగా నిలుస్తారని పురాణాల్లో చెప్పబడింది. అయితే కర్ణుడు మళ్ళీ పుడతాడని గానీ.. కల్కికి, కలి రాక్షసుడికి మధ్య జరిగే భీకర యుద్ధంలో పాలుపంచుకుంటాడని గానీ ఎక్కడ ప్రస్తావించబడలేదు.

అలాంటప్పుడు కర్ణుడి పాత్రను ఎలా చూపిస్తారన్న ప్రశ్నను ఇప్పుడు నాగ్ అశ్విన్ కి విసురుతున్నారు. ఈ విషయంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు గానీ ఇక్కడే లెక్క తప్పారు. కల్కి సినిమాలో కర్ణుడిని ఎందుకు అంత గొప్పగా చూపించారని అడగ్గా.. మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు, అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అతని క్యారెక్టర్ ని హైలైట్ చేశానని నాగ్ అశ్విన్ అన్నారు.

మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప అన్న ప్రశ్న నాగ్ అశ్విన్ ముందు ఉంచితే.. దానికి సమాధానంగా ఆయన మరో వివరణ ఇచ్చారు. ‘అర్జునుడు, కర్ణుడు ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడితే.. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఇదే ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పడేసింది. సినిమాలో కర్ణుడిని హైలైట్ చేస్తే చేశారు కానీ రియల్ లైఫ్ లో అర్జునుడు, కర్ణుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే దానిపై సూటిగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

మహాభారతం ప్రకారం కర్ణుడు అన్ని విషయాల్లో మంచివాడే కావచ్చు కానీ అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి గొప్పవాడు కాదు. కాబట్టి అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే ధర్మం తన వైపు ఉన్న అర్జునుడిని గొప్ప అని చెప్పకుండా.. సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలో నెట్టేయడం దేనికి? సినిమా చూసి.. ఆ తర్వాత మహాభారతం చూసి కర్ణుడి క్యారెక్టర్ ని తనిఖీ చేసుకునేంత తెలివైన మనుషులున్నారా? సినిమా అనేది మనిషిని ఎంతగానో ప్రభావితం చేసే సాధనం. అలాంటి సాధనం ద్వారా మంచి, చెడు ఏంటో చెప్పకుండా ప్రేక్షకులే నిర్ణయించుకుంటారు ఏది మంచో, ఏది చెడో అని వదిలేయడం ఎంతవరకూ కరెక్ట్? పురాణాల నుంచి క్యారెక్టర్స్ ని రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నాగ్ అశ్విన్ కి ఈ మాత్రం తెలియదా? లేక తెలిసే ఇలా చేశారా? ఈ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన వివరణ లెక్క తప్పింది. తన సినిమా కోసం చూసుకున్నారే గానీ తనపై వస్తున్న నెగిటివిటీ గురించి ఆలోచించలేకపోయారు.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి