iDreamPost
android-app
ios-app

నాగ్ అశ్విన్, సందీప్ వంగా సహా పలు దర్శకుల క్యామియో రోల్స్.. ఏయే సినిమాలంటే?

  • Published Jul 22, 2024 | 10:06 PM Updated Updated Jul 22, 2024 | 10:06 PM

Do You Know Nag Ashwin, Sandeep Reddy Vanga Acted In These Movies: నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా ఈ ఇద్దరూ సినిమాల్లో నటించారని తెలుసా? దర్శకులు అవ్వడం కంటే ముందు వీరిద్దరూ సినిమాల్లో నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి వీళ్ళు ఏ సినిమాల్లో నటించారో ఓ లుక్కేయండి.

Do You Know Nag Ashwin, Sandeep Reddy Vanga Acted In These Movies: నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా ఈ ఇద్దరూ సినిమాల్లో నటించారని తెలుసా? దర్శకులు అవ్వడం కంటే ముందు వీరిద్దరూ సినిమాల్లో నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి వీళ్ళు ఏ సినిమాల్లో నటించారో ఓ లుక్కేయండి.

  • Published Jul 22, 2024 | 10:06 PMUpdated Jul 22, 2024 | 10:06 PM
నాగ్ అశ్విన్, సందీప్ వంగా సహా పలు దర్శకుల క్యామియో రోల్స్.. ఏయే సినిమాలంటే?

నటించాలని.. వెండి తెరపై కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎంతోమందిని నటీనటులుగా తీర్చిదిద్దే దర్శకులకి కూడా ఈ పిచ్చి ఉంటుంది. ఒకసారైనా వెండి తెరపై కనిపించాలని.. ఒక సీన్ లో అయినా నటించాలని అనుకుంటారు. కొంతమంది ఆ సమయానికి ఎవరూ లేక నటించాల్సి వస్తుంది. గతంలో సై సినిమాలో రాజమౌళి నటించడం గానీ, ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలో వి వి వినాయక్ నటించడం, పూరీ జగన్నాథ్ అయితే శివ, ఏ మాయ చేసావే, బిజినెస్ మ్యాన్ సహా అనేక సినిమాల్లో నటించడం గానీ ఇలా దర్శకులు క్యామియో రోల్స్ లో కనిపించడం భలే కిక్ ఇస్తుంది. వారికి మాత్రమే కాకుండా ఆడియన్స్ ని కూడా థ్రిల్ కి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, హరీష్ శంకర్ ఇలా పలు దర్శకులు నటించిన సినిమాలకి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. గోపీచంద్, అనుష్క నటించిన శౌర్యం సినిమాలో హాస్పిటల్ రిసెప్షనిస్ట్ గా అనిల్ రావిపూడి క్యామియో రోల్ లో కనిపిస్తారు. వర్షం సినిమాలో వంశీ పైడిపల్లి బస్సు ప్రయాణికుడిగా ప్రభాస్ వెనుక రెండో సీట్లో కూర్చుని క్లాప్స్ కొడుతూ కనిపిస్తారు. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో కనిపిస్తారు. అంతేకాదు లక్ష్యం సినిమాలో సేల్స్ పర్సన్ గా, విన్నర్ సినిమాలో బైకర్ గా కూడా కనిపిస్తారు. ఆర్య సినిమాలో శ్రీకాంత్ అడ్డాల, అందరివాడు సినిమాలో హరీష్ శంకర్ క్యామియో రోల్స్ లో నటించారు. కల్కి 2898 ఏడీ సినిమాతో రికార్డులు తిరగరాసిన నాగ్ అశ్విన్.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారని చాలా మందికి తెలియదు.

ఈ మూవీలో మ్యాచ్ జరుగుతున్న సన్నివేశంలో వెనుక నిలబడి చూస్తుంటారు నాగ్ అశ్విన్. ఇదే కాదు మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా మూవీలో బ్రహ్మానందం అసిస్టెంట్ గా కూడా నాగ్ అశ్విన్ నటించారు. లీడర్ సినిమాలోని ‘హే సీఎం’ అనే పాటలో బైక్ రైడర్ గా కూడా నాగ్ అశ్విన్ కనిపిస్తారు. సందీప్ రెడ్డి వంగా అయితే నాగార్జున నటించిన కేడీ సినిమాలో కనిపిస్తారు. సినిమా స్టార్ట్ అయిన మొదట్లో ఒక పడవలో బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్న వ్యక్తి సందీప్ రెడ్డి వంగానే. పోలీస్ గన్ తో కాలుస్తాడు. ఇలా మన దర్శకులు నటించిన సినిమాలకు సంబంధించిన సీన్స్ ని ఒక వీడియోలో రూపొందించి ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి మీకు నచ్చిన దర్శకుడి క్యామియో రోల్ ఏంటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş