మహానటిలో చిన్నప్పటి సావిత్రి.. ఇప్పుడు మరింత బబ్లీగా

కల్కి 2898 ADతో ట్రెండింగ్ లో నిలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్.. మూడు సినిమాలతోనే టాప్ మోస్ట్ దర్శకుడిగా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన సెకండ్ మూవీ మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. చైల్డ్ సావిత్రిగా నటించిందో పాప... ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

కల్కి 2898 ADతో ట్రెండింగ్ లో నిలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్.. మూడు సినిమాలతోనే టాప్ మోస్ట్ దర్శకుడిగా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన సెకండ్ మూవీ మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. చైల్డ్ సావిత్రిగా నటించిందో పాప... ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

కల్కి 2898 ADతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు నాగ్ అశ్విన్. డాక్టర్స్ కుటుంబంలో పుట్టిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు . ఫిల్మ్ డైరెక్టర్ కోర్సు చేసి.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. గురువు శేఖర్ కమ్ములకు తగ్గ శిష్యుడు. చాలా డౌన్ టు ఎర్త్. కల్కి కంటే ముందు కేవలం రెండంటే రెండు చిత్రాలు చేశాడు. ఈ రెండింటిలో సెకండ్ మూవీతోనే బాలీవుడ్ చూపు తన వైపుకు తిప్పుకునేలా చేశాడు. ఆ మూవీనే మహానటి. దివంగత నటి సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు నాగీ. 2018లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు అవార్డులను కొల్లగొట్టింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నుండి.. నేషనల్ అవార్డుల వరకు ఎన్నో అవార్డ్స్ క్యూ కట్టాయి.

ఇందులో మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ఒదిగిపోయింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. ఈమెను తప్ప మరొకర్ని సావిత్రమ్మ పాత్రలో ఊహించుకోవడం కష్టం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంక దత్ నిర్మించారు. సి అశ్వనీదత్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సాయి మాధవ్ బుర్రా క్యామియో పాత్రలో నటించారు. అలాగే చిన్నప్పటి సావిత్రి, సుశీల పాత్రల్లో మెరిశారు ఇద్దరు చిన్నారులు. వారిలో సావిత్రి లాంటి బరువైన పాత్రను పోషించిన పాప గుర్తుందా.?

‘ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం’సాంగ్‌తో పాటు పలు సన్నివేశాల్లో ఆకట్టుకుంది చిన్నారి. ఆ పాప ఎవరో తెలుసా.? ప్రముఖ స్టార్ హీరో, నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని. ఇందులో చాలా చక్కగా నటించింది. సావిత్రి చిన్నప్పుడు ఇలానే ఉండేదా అనిపించేలా యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. కీర్తి సురేష్‌తో పాటు ఈ పాపకు కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి. మరీ ఈ చిట్టి చిన్నారి ఇప్పుడెలా మారిందో తెలుసా..? అప్పటికీ, ఇప్పటికీ అదే బబ్లీనెస్‌తో అలరిస్తుంది. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ అమ్మాయి.. ప్రస్తుతం దూరంగా ఉంటుంది.

Show comments