iDreamPost
android-app
ios-app

మైత్రి మూవీ మేకర్స్ హై ఓల్టేజ్ కాంబినేషన్స్.. అన్నీ హై బడ్జెట్ లోనే..

  • Published Mar 15, 2024 | 3:43 PM Updated Updated Mar 15, 2024 | 3:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు హై ఓల్టాజి కాంబినేషన్స్ ఏ ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు హై ఓల్టాజి కాంబినేషన్స్ ఏ ఉన్నాయి.

  • Published Mar 15, 2024 | 3:43 PMUpdated Mar 15, 2024 | 3:50 PM
మైత్రి మూవీ మేకర్స్ హై ఓల్టేజ్ కాంబినేషన్స్.. అన్నీ హై బడ్జెట్ లోనే..

మైత్రి మూవీ మేకర్స్.. ఈ సంస్థ ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తోంది. అటు భారీ బడ్జెట్ లో సినిమాలు తీస్తూనే.. ఇటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా అడుగుపెడుతూ మంచి అందుకుంటుంది.. ఈ నిర్మాణ సంస్థ. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ చిత్రాన్ని .. తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేసే రైట్స్ ను మైత్రి మేకర్స్ సంస్థ సొంతం చేసుకుని భారీ లాభాలు సాధించింది. అలానే తెలుగుతో పాటు.. ఇటు ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల మలయాళంలో .. టీవీనో థామస్ హీరోగా తెరకెక్కుతున్న.. పాన్ ఇండియా ఫిల్మ్ కు.. అలాగే, తమిళ్ లో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఫిల్మ్ కు కూడా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. తెలుగులో పుష్ప-2 సినిమాను రూ.300 కోట్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు15 న విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో.. ఓ హిందీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మైత్రి మూవీ నిర్మాణ సంస్థ .. ఓవర్సీస్ అన్ని దేశాలలో.. పుష్ప-2 సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కేవలం అల్లు అర్జున్ .. దర్శకుడు సుకుమార్ కు మాత్రమే కాకుండా.. మైత్రి నిర్మాణ సంస్థ వారికి కూడా.. పుష్ప-2 సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇలా ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ చేతిలో అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఈ సినిమాను కూడా మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించనుంది. అలాగే, రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా వీరి కమింగ్ ప్రాజెక్ట్ లిస్ట్ లో ఉన్నాయి.

Back to back high voltage movies in mythri banner

వీటితో పాటు.. ప్రభాస్-హను రాఘవపుడి కాంబినేషన్ లో రాబోయే సినిమాను.. ఏకంగా 400 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించనుందట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ కు సంబంధించిన సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. ప్రభాస్ కనుక ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుంచి ఫ్రీ అయిపోతే.. హను సినిమా ఈ ఏడాది ఆఖరుకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా.. మైత్రి చేతిలోనే ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఈ సంస్థ చేతిలో బ్యాక్ తో బ్యాక్ అన్ని బడా హీరోల చిత్రాలే ఉన్నాయి. పైగా, అన్నీ వందల కోట్ల హై బడ్జెట్ తోనే రూపొందిస్తున్నారు. అంతేకాకుండా.. కేవలం టాలీవుడ్ లోనే ఆగిపోకుండా.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన భాషల్లో కూడా మైత్రి మేకర్స్ సంస్థ చిత్రాలను నిర్మించడానికి సిద్ధం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş