iDreamPost
android-app
ios-app

Prabhas-Iman Esmail: ప్రభాస్ కొత్త సినిమా పూజలో కనిపించినఈ అమ్మాయి ఎవరు?

  • Published Aug 17, 2024 | 3:17 PM Updated Updated Aug 17, 2024 | 3:22 PM

Prabhas-Iman Esmail, Hanu Raghavapudi: ప్రభాస్-హను రాఘవపూడి మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డార్లింగ్ పక్కన ఓ బ్యూటీ తళుక్కున మెరింది. ఆ అమ్మాయి ఎవరు? అంటూ నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?

Prabhas-Iman Esmail, Hanu Raghavapudi: ప్రభాస్-హను రాఘవపూడి మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డార్లింగ్ పక్కన ఓ బ్యూటీ తళుక్కున మెరింది. ఆ అమ్మాయి ఎవరు? అంటూ నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?

  • Published Aug 17, 2024 | 3:17 PMUpdated Aug 17, 2024 | 3:22 PM
Prabhas-Iman Esmail: ప్రభాస్ కొత్త సినిమా పూజలో కనిపించినఈ అమ్మాయి ఎవరు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం శనివారం(ఆగస్ట్ 17)న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈరోజు సాయంత్రం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఈ పూజా కార్యక్రమంలో ప్రభాస్ పక్కన కనిపించిన ఓ అమ్మాయి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?

ప్రభాస్-హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. పూర్తి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ఓ బ్రిటీస్ సోల్జర్ గా ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా తెలియలేదు. కానీ.. తాజాగా పూజా కార్యక్రమంలో మెరిసిన అమ్మాయినే హీరోయిన్ గా అనుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఈ అమ్మాయి ఈ సినిమా పూజకు ఎందుకు వచ్చింది? ఈమెనే ఇందులో హీరోయినా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే?

ప్రభాస్ పక్కన పూజా కార్యక్రమంలో ఉన్న ఈ బ్యూటీ పేరు ఇమాన్ ఇస్మాయిల్. 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి.. తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్స్ ప్ల్యూయెన్సర్ గా మారింది. ఇన్ స్టాలో ఆమె డ్యాన్స్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో స్టేజ్ లపై డ్యాన్స్ షోలు చేసింది. అలాగే మరెన్నో వీడియో ఆల్బమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె డ్యాన్స్ వీడియోలు గతంలో చాలా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 686K ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆమె ఈ సినిమా పూజా కార్యక్రమానికి ఎందుకు వచ్చింది? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించేది ఈ అమ్మాయేనా? వెల్కమ్ టు టాలీవుడ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇమాన్ ఇస్మాయిల్ డార్లింగ్ పక్కన నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

 

View this post on Instagram

 

A post shared by YouWe Media (@youwemedia)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş