iDreamPost
android-app
ios-app

ఓటిటిలోకి లేటెస్ట్ హిట్ ‘మంత్ ఆఫ్ మధు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Author ajaykrishna Updated - 07:05 PM, Tue - 31 October 23

రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మంత్ ఆఫ్ మధు. ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో.. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే..

రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మంత్ ఆఫ్ మధు. ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో.. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే..

  • Author ajaykrishna Updated - 07:05 PM, Tue - 31 October 23
ఓటిటిలోకి లేటెస్ట్ హిట్ ‘మంత్ ఆఫ్ మధు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారో ఎవరికి అర్ధం కాదు. కాకపోతే ఒకటి మాత్రం పక్కాగా చెప్పవచ్చు. ఇదివరకు అంటే సినిమాలు యాభై, వంద అంటూ రోజుల పాటు థియేటర్స్ లో ఆడేవి. కానీ.. ఇప్పుడు ఏ సినిమా అయినా ఫలితం తేలేది వారం రోజుల్లోనే. అందులోనూ కొన్ని సినిమాలకు వీకెండ్ ఒక్కటే అవకాశంగా నిలుస్తుంది. సినిమాలకు వస్తున్న టాక్ బట్టి జనాలు థియేటర్స్ కి వెళ్తున్నారు. అదే గతంలో చూసుకుంటే టాక్ కి సంబంధం లేకుండా వెళ్లేవారు. ఇప్పటి గురించి మాట్లాడుకుంటే.. ఎలాంటి సినిమాలైనా సరే కంటెంట్ చూసి ఆదరిస్తున్నారు. ఇదైతే నిజం.

ఈరోజుల్లో సినిమాలు సక్సెస్ అవ్వాలంటే పక్కాగా కంటెంట్ కొత్తగా ఉండాలి. ఆ కంటెంట్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి. అయితేనే సినిమాలకు ఊహించని రేంజ్ లో సక్సెస్ వచ్చి పడుతుంది. లేదంటే.. వీకెండ్ లోనే థియేటర్స్ లో నుండి దుకాణం సర్దుకోవాల్సిన పరిస్థితి. కంటెంట్ ఫ్రెష్ గా ఉన్నా.. సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే.. ఫలితం ఆశించిన విధంగా రాకపోవచ్చు. ప్రస్తుతం అలాంటి సినిమానే ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. ఆ సినిమానే ‘మంత్ ఆఫ్ మధు’. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటి.

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కాస్ట్ మినిమమ్ ఉన్నప్పటికి.. పెద్దగా బజ్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కేవలం ట్రైలర్ ఒక్కటే.. మంత్ ఆఫ్ మధు పై ఆసక్తి కలిగించింది. థియేటర్స్ లో ప్రీమియర్స్ టాక్ బాగానే వచ్చినప్పటికి.. తీరా ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఫలితం మారిపోయింది. కట్ చేస్తే.. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన నెల రోజులలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మంత్ ఆఫ్ మధు స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా వారు సొంతం చేసుకున్నారు. నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. భార్యాభర్తల బంధాన్ని సందేశత్మకంగా ఆవిష్కరించిన ఈ సినిమా.. ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom