iDreamPost
android-app
ios-app

ఇంతకీ లోకేష్ సినిమాలో రజినీ హీరోనా.. విలనా..?

  • Author ajaykrishna Updated - 07:06 PM, Tue - 31 October 23

తలైవార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తలైవార్ 171 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పుడే ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది లోకేష్ తాజాగా రజినీ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే..

తలైవార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తలైవార్ 171 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పుడే ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది లోకేష్ తాజాగా రజినీ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే..

  • Author ajaykrishna Updated - 07:06 PM, Tue - 31 October 23
ఇంతకీ లోకేష్ సినిమాలో రజినీ హీరోనా.. విలనా..?

ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో విజన్ ఉంటుంది. అందులోనూ ఒక్కో హీరోని ఇలా చూపించాలి.. అలా చూపించాలి అంటూ వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యుంటారు. ఒక్కసారి అవకాశం వస్తే.. తాను ముందునుండి ఊహించుకున్న బాడీ లాంగ్వేజ్ లేదా క్యారెక్టర్ తో ఆ హీరోని తెరపై ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అభిమాన హీరోలనే కాదు.. ఏ హీరోతో అయినా సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఎవరైనా డిఫరెంట్ గా చూపించాలని ఆలోచిస్తారు. ఎందుకంటే.. అందరు ఆల్రెడీ ఆ హీరోని అన్ని రకాలుగా చూపించేశారు. సో.. తనైనా కొత్తగా.. తాను అనుకున్న విధంగా చూపిద్దాం అని ఆలోచన చేస్తారు.

ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎలా చూపించాలో తనకు ముందే ఓ ఐడియా ఉందని.. తాను ఎలాగైనా రజినీని తెరపై చూపించాలని అనుకున్నాడో అలాగే ప్రెజెంట్ చేసేందుకు ట్రై చేస్తానని రీసెంట్ గా కోలీవుడ్ మీడియాతో చెప్పినట్లు తెలుస్తుంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో వరుసగా సూపర్ ఫామ్ లో ఉన్న లోకేష్.. తదుపరి సినిమాని రజినీతో చేయనున్న సంగతి తెలిసిందే. తలైవార్ 171వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆల్రెడీ అధికారిక అనౌన్స్ మెంట్ అయితే జరిగిపోయింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సినిమాని నిర్మించనున్నారు.

ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ తో లోకేష్ సినిమా అన్నప్పుడే ఫ్యాన్స్ అందరిలో అంచనాలు సెట్ అయిపోయాయి. ఎందుకంటే.. LCU తో లోకేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. సో.. ఈసారి తలైవార్ ని కూడా LCU లో భాగం చేస్తాడా లేక వేరే సబ్జెక్టుతో సినిమా చేస్తాడా? అనే సందేహాలు ఓ వర్గం వరకు నెలకొన్నాయి. కాగా.. తనకు రజినీ సార్ లో విలనిజం చాలా ఇష్టమని.. తాను తీయబోతున్న సినిమాలో రజినీ విలనిజంపై ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు లోకేష్. అయితే.. రజినీలో విలనిజం ఇష్టం అంటున్నాడు కాబట్టి.. ఇంతకీ లోకేష్ సినిమాలో రజినీ హీరోనా.. విలనా? అంటున్నారు నెటిజన్స్. మరి ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom