Mangalavaram Movie Review & Rating in Telugu: ‘మంగళవారం’ సినిమా రివ్యూ!

Mangalavaaram Review: ‘మంగళవారం’ సినిమా రివ్యూ!

Mangalavaaram Movie Review in Telugu & Rating: అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబోలో తెరకెక్కిన రెండో సినిమా ‘మంగళవారం’. భారీ అంచనాల నడుమ ‘మంగళవారం’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

Mangalavaaram Movie Review in Telugu & Rating: అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబోలో తెరకెక్కిన రెండో సినిమా ‘మంగళవారం’. భారీ అంచనాల నడుమ ‘మంగళవారం’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

మంగళవారం

20231117, A
హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌
  • నటినటులు:పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్‌ అమిర్‌, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తదితరులు
  • దర్శకత్వం:అజయ్‌ భూపతి
  • నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ
  • సంగీతం:అజనీష్‌ లోకనాథ్‌
  • సినిమాటోగ్రఫీ:శివేంద్ర దాశరథీ

3

ఇండస్ట్రీకి సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు, హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు కొత్తేమీ కాదు. ప్రతీ ఏటా ఎన్నో సినిమాలు వస్తూ ఉ‍న్నాయి. అయితే, తెరకెక్కించే విధానంలో.. కథ, కథనంలో మిగిలిన సినిమాలతో భిన్నంగా ఉన్న సినిమాలే ఘన విజయం సాధిస్తున్నాయి. అంచనాలను అందుకుంటున్నాయి. అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబోలో వచ్చిన హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. భారీ అంచనాల నడుము ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను సినిమా అందుకుందా? అజయ్‌ భూపతి సస్పెన్స్‌ను కొనసాగించటంలో సక్సెస్‌ సాధించారా? లేదా?

కథ :

అదో కుగ్రామం. ఆ గ్రామం పేరు ‘ మహాలక్ష్మీపురం’. ఊర్లోని ఓ భవనం గోడపై గ్రామానికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ గుర్తు తెలియని ఓ వ్యక్తి రాతలు రాస్తాడు. దీంతో మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున ఆ జంట ఊర్లో ఆత్మహత్య చేసుకుంటుంది. రాతల కారణంగానే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకుంటారు. అయితే, ఇవి ఆత్మహత్యలు కావని.. హత్యలని ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ(నందిత) బలంగా నమ్ముతుంది. శవాలకు పోస్టుమార్టం నిర్వహించాలని అనుకుంటుంది. అయితే, ఇందుకు ఊరి జమిందారు అయిన ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) అడ్డుపడతాడు. అతడికి ఊరి జనం వత్తాసు పలుకుతారు. కొద్దిరోజుల తర్వాత మరో జంట ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో మాయ ఊరు మొత్తాన్ని ఎదురించి పోస్టుమార్టం జరిపిస్తుంది. ఆ పోస్టు మార్టంలో ఏం తేలింది? ఈ అనుమానస్పద మరణాలకు శైలు( పాయల్‌ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ మధన్‌( అజ్మల్‌ అమిర్‌) ఎవరు? వీరికి ఆ కథకు సంబంధం ఏంటి? అన్నదే అసలు ట్విస్టు..

విశ్లేషణ:

దర్శకుడిగా అజయ్‌ భూపతి ప్రతీ సినిమాలో తనను తాను నిరూపించుకుంటూ ఉన్నారు. సినిమాకు సినిమాకు మధ్య కథలో.. కథనంలో వేరియేషన్స్‌ చూపిస్తూ ఉన్నారు. తెలుగులో ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. అయినప్పటికి కథను సస్పెన్స్‌ఫుల్‌గా తెరకెక్కించటంలో అజయ్‌ భూపతి నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యాడు. పాత కథను కొత్త కోణంలో తీయటం ఆయనకు మాత్రమే చెల్లింది. ఈ సినిమా కూడా ఓ లేడీ చుట్టే తిరుగుతుంది. ఒకానొక దశలో ‘మంగళవారం’ సినిమాలో లేడీనే విలన్‌ అన్న భావన కలుగుతుంది. స్క్రీన్‌ ప్లే విషయంలో అజయ్‌ ‍ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు .. ప్రతీ ఫ్రేమును చూస్తే అర్థం అవుతుంది.

నటీనటుల పని తీరు :

హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నటీనటుల యాక్టింగ్‌ మీదే సినిమా ప్రేక్షకులకు ఎక్కడం జరుగుతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా చేశారు. మేయిన్‌ క్యారెక్టర్ల గురించి అయితే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్‌ అమిర్‌, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తమ పాత్రల్లో జీవించారు. తెర మీద ఆ విషయం మనకు కనిపిస్తుంది. సినిమా మొదలైన కొద్ది సేపటినుంచే మనం పాత్రల్లో లీనమై పోతాము. మనకు తెరమీద నటీ,నటులు కాకుండా పాత్రలే దర్శనమిస్తాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌ అని చెప్పొచ్చు. అజనీష్‌ లోకనాథ్‌ కొన్ని సీన్లలో తన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మనల్ని భయపెట్టేస్తాడు. కెమెరా పని తనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతీ సీన్‌ ఓ నిజంలా మన కళ్లముందు కదలాడుతుంది. ఏ షాట్‌కు ఆ షాట్‌ మాస్టర్‌ పీస్‌లా అనిపిస్తాయి.  ఇక, ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. ఎడిటర్‌ పని తనం మనకు ఇట్టే అర్థం అయిపోతుంది.

ప్లస్ లు:

  • నటీ,నటుల నటన
  • మ్యూజిక్‌
  • ఎడిటింగ్‌

చివరి మాట: ‘మంగళవారం’ ఇది ప్రారంభం మాత్రమే..

రేటింగ్: 3/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments