iDreamPost
android-app
ios-app

మంచు ‘భక్త కన్నప్ప’ లో మనోజ్‌… అసలు మ్యాటర్‌ ఇదే

  • Published Dec 08, 2023 | 6:36 PM Updated Updated Dec 08, 2023 | 6:36 PM

Manchu Manoj: మంచు విష్ణు చాలా ఏళ్లుగా కలలు కంటూ వస్తున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప ఎట్టకేలకు షురూ అయింది. ఒకొక్క అడుగు వేస్తూ భక్త కన్నప్ప సినిమా ను ముందుకు తీసుకు పోతున్నాడు. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌ తో పాటు ఎంతో మంది స్టార్స్ కనిపించబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక గెస్ట్‌ రోల్‌ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

Manchu Manoj: మంచు విష్ణు చాలా ఏళ్లుగా కలలు కంటూ వస్తున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప ఎట్టకేలకు షురూ అయింది. ఒకొక్క అడుగు వేస్తూ భక్త కన్నప్ప సినిమా ను ముందుకు తీసుకు పోతున్నాడు. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌ తో పాటు ఎంతో మంది స్టార్స్ కనిపించబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక గెస్ట్‌ రోల్‌ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

  • Published Dec 08, 2023 | 6:36 PMUpdated Dec 08, 2023 | 6:36 PM
మంచు ‘భక్త కన్నప్ప’ లో మనోజ్‌… అసలు మ్యాటర్‌ ఇదే

మంచు విష్ణు చాలా ఏళ్లుగా భక్త కన్నప్ప ప్రాజెక్ట్‌ గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్న విషయం తెల్సిందే. చాలా సార్లు విష్ణు మాట్లాడుతూ తనకు భక్త కన్నప్ప డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అన్నాడు. తనికెళ్ల భరణితో కలిసి సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రాజెక్ట్‌ గురించి చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు తనికెళ్ల భరణి చేతి నుంచి ఆ ప్రాజెక్ట్ మరో చేతికి చేరింది. మంచు విష్ణు సినిమాను స్వయంగా నిర్మించేందుకు సిద్ధం అయ్యారు.

తన కెరీర్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌ తో భక్త కన్నప్పను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో పాటు మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ ను ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేందుకు ఒప్పించాడు. స్టార్‌ కాస్ట్‌ తోనే ఈ సినిమా కు పాన్‌ ఇండియా అప్పీల్ తీసుకు వచ్చే విధంగా మంచు విష్ణు భారీ తారాగణంను ఎంపిక చేసుకుంటున్నాడు.

manchu manoj in baktha kannapa

స్టార్స్‌, సూపర్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించేది కొద్ది నిమిషాలే అయినా కూడా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో పాటు, సినిమాకు హైప్ తీసుకు రాగలరు. అందుకే మంచు విష్ణు తనకు ఉన్న పరిచయాలతో భక్త కన్నప్ప ను స్టార్‌ కాస్ట్ తో నింపేస్తున్నాడు. భక్త కన్నప్ప సినిమా షూటింగ్‌ ప్రారంభించేది ఎప్పుడో కానీ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ వస్తూనే ఉంది.

ఇప్పుడు కొత్తగా భక్త కన్నప్ప సినిమా లో మంచు మనోజ్‌ కూడా కనిపించబోతున్నాడు అంటూ గుసగుసలు మొదలు అయ్యాయి. ఆ మధ్య మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య గొడవలు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్‌ అయింది. అయితే మంచు ఫ్యామిలీ లో గొడవలు ఏమీ లేవని కొందరు ఆ సమయంలో చెప్పుకొచ్చారు. ఇంతకు గొడవలు ఉన్నాయా లేదా అనే విషయమై క్లారిటీ రాలేదు. కానీ తాజాగా మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లో మనోజ్ నటించబోతున్నాడు అంటూ పుకార్లు మొదలు అయ్యాయి.

manchu manoj in baktha kannapa

మంచు మనోజ్‌ నిజంగానే భక్త కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడా అంటూ మేము తెలుసుకునే ప్రయత్నం చేశాము. మంచు మనోజ్ కి చెందిన సన్నిహితులు ఆ వార్తలు కొట్టి పారేశారు. మంచు మనోజ్‌ తో భక్త కన్నప్ప గురించిన చర్చలు ఎప్పుడూ జరగలేదు. కనుక ఆ సినిమాలో మనోజ్ నటించబోతున్నాడు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. ఏడు ఏళ్ల తర్వాత మంచు మనోజ్‌ కెమెరా ముందుకు వచ్చాడు. ఒక వైపు సినిమాలో నటిస్తూ మరో వైపు ఉస్తాద్‌ అనే గేమ్ షో కి హోస్ట్‌ గా వ్యవహరించేందుకు సిద్ధం అయ్యాడు.

ఈటీవీ విన్‌ ఓటీటీ యాప్‌ ద్వారా ఉస్తాద్‌ గేమ్‌ షో రాబోతుంది. మొత్తానికి మంచు మనోజ్ తన ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నాడు కానీ అన్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ తో మాత్రం ఎలాంటి సంబంధం కలిగి లేడని తేలిపోయింది. మంచు వారి కన్నప్పలో మనోజ్‌ కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు బ్రదర్స్ కలిసి నటించడం సాధ్యం అని మీరు భావిస్తున్నారా? భక్త కన్నప్పలో మంచు మనోజ్ ఉంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş