iDreamPost
android-app
ios-app

ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన మలయాళ ముద్దుగుమ్మ..!

  • Published Jan 22, 2024 | 2:41 PM Updated Updated Jan 22, 2024 | 6:02 PM

సలార్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుంది. ఈ మూవీ ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయన నటిస్తోన్న ఓ సినిమాలో ఫిక్స్ అయ్యింది ఈ మలయాళ స్టార్ హీరోయిన్..

సలార్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుంది. ఈ మూవీ ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయన నటిస్తోన్న ఓ సినిమాలో ఫిక్స్ అయ్యింది ఈ మలయాళ స్టార్ హీరోయిన్..

  • Published Jan 22, 2024 | 2:41 PMUpdated Jan 22, 2024 | 6:02 PM
ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన మలయాళ ముద్దుగుమ్మ..!

మలయాళ ముద్దుగుమ్మలు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి యమ క్రేజ్. అందుకే అక్కడి భామలను ఇక్కడ దిగుమతి చేసుకుని.. రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటారు కేరళ కుట్టీస్. చారడేసి కళ్లు, ఒత్తైన జుట్టు, నటన టాలీవుడ్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంటాయి. రాధ, శోభన దగ్గర నుండి నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, మాళవిక మోహనన్ వరకు అనేక మంది తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో మాలీవుడ్ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి వడివడిగా అడుగులు వేస్తోంది. అదీ కూడా ఓ స్టార్ హీరో సరసన. అతడూ ఎవరో కాదూ.. గ్లోబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్.

సలార్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మైథాలజీ సైన్స్ ఫిక్షనల్ మూవీ కల్కి 2898 ఏడీ షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భారీ తారాగణం ఉన్న సంగతి విదితమే. బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీతో పాటు కమల్ హాసన్, పశుపతి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ మలయాళ బ్యూటీ అన్నాబెన్ ఈ చిత్రంలో నటించనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. అన్నా బెన్ అంటే తెలియకపోవచ్చు కానీ.. ఆమె డబ్బింగ్ సినిమాలను చూసిన వారైతే గుర్తు పడతారు. తన నటనతో ఫిదా చేసేస్తుంది.

కప్పేలా (తెలుగులో బుట్టబొమ్మ అని రీమేక్ చేశారు), హెలెన్ (హిందీలో జాన్వీకపూర్ మిలీ అని చేసింది), కుంబలంగీ నైట్స్ అనే చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. మలయాళంలో వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు మాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోయిన్ ఆమె. ఈసమయంలో ఆమెకు కల్కిలో చేసే అవకాశం వచ్చింది. గత ఏడాది త్రిశంకు అనే సినిమాల నటించిన ఈ కేరళ కుట్టీ.. ఇప్పుడు ద అడమెంట్ గర్ల్ అనే తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు కల్కి ఆఫర్ కొట్టేసింది. వీటితో పాటు మరో చిత్రం కూడా చేస్తోంది. కాగా, కల్కి చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమారు రూ. 500 కోట్లతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న కల్కి.. ఈ ఏడాది మే 9న విడుదల కానుంది. ఈ బ్యూటీ సినిమాలు చూసి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom