iDreamPost
android-app
ios-app

వచ్చే ఏడాది నుంచి మహేష్ అన్ని బంద్ పెట్టాల్సిందే.. ఎందుకంటే?

  • Published Nov 18, 2023 | 7:59 PM Updated Updated Nov 18, 2023 | 7:59 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వచ్చే ఏడాది మరింత బిజీ కానున్నారు. 2024 నుంచి వెకేషన్ కు కూడా వెల్లలేని పరిస్థితి. దీనికి గల కారణం ఆ డైరెక్టర్ తో సినిమా చేయడమే. ఆ వివరాలు మీకోసం..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వచ్చే ఏడాది మరింత బిజీ కానున్నారు. 2024 నుంచి వెకేషన్ కు కూడా వెల్లలేని పరిస్థితి. దీనికి గల కారణం ఆ డైరెక్టర్ తో సినిమా చేయడమే. ఆ వివరాలు మీకోసం..

  • Published Nov 18, 2023 | 7:59 PMUpdated Nov 18, 2023 | 7:59 PM
వచ్చే ఏడాది నుంచి మహేష్ అన్ని బంద్ పెట్టాల్సిందే.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరోల్లో ఇప్పటికీ అందం అంటే గుర్తుకి వచ్చేది మహేశ్ బాబే. తన మొదటి చిత్రం నుంచే తెలుగు ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు. సైలెంట్ గా కనిపిస్తూనే సూపర్ హిట్స్ కొట్టేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ హీరో ఫ్యామిలీ టైం ని మాత్రం మిస్ చేయడు. ప్రతి సంవత్సరం ఐదారు సార్లు కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లకు వెళ్తుంటాడు మహేష్. అయితే.. ఈ విషయంలో 2023 వరకు ఒక లెక్క.. తర్వాత ఒక లెక్క అన్నట్లు పరిస్థితి మారబోతుందట.

దీనికి.. కారణం లేకపోలేదు. ఇప్పటివరకు మహేష్ తన పిల్లల హాలిడేస్, తన షూటింగ్ షెడ్యూల్ చూసుకుంటూ వెకేషన్ ప్లాన్ చేసేవాడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ, 2024 లో మహేష్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి వర్క్ చేయనున్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక జక్కన్న ఒక్కసారి వర్క్ స్టార్ట్ చేశాడంటే.. షూటింగ్ పూర్తి అయ్యే వరకు అతనికి కట్టుబడి ఉండాల్సిందే. జక్కన వర్క్ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనితో కలిసి పనిచేసిన వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది.

ప్రభాస్, రానా, తారక్, రామ్ చరణ్ .. లాంటి నటులు ఎన్నో ఈవెంట్స్ లో ఇంటర్వూస్ లో జక్కన పని తీరు గురించి చెప్పేవారు. పని విషయంలో రాజమౌళి రాక్షసుడు అని చమత్కారాలు చేసేవారు. అతను అంత శ్రద్దగా సినిమాను చిత్రీకరిస్తున్నారు కాబట్టే.. తీసిన ప్రతి చిత్రం సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ‘బాహుబలి’ , ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో అవార్డ్స్ ను అందుకున్నాయి. ఒక్కసారి ఈ స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే వాళ్లకు ఊహించని స్టార్ డమ్ ను తెచ్చిపెడుతున్నారు. ఇక వచ్చే ఏడాది ప్రిన్స్ మహేష్ తో తన చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.

ఒక్కసారి షూటింగ్ మొదలైందంటే కంప్లీట్ అయ్యేవరకు టీం అంతా జక్కన్నతో ఉండాల్సిందే. సెట్స్ దాటి బయటకు వెళ్ళడానికి ఈ దర్శకుడు అసలు ఒప్పుకోడు. అంత అంకితభావంతో మూవీని చిత్రీకరిస్తాడు రాజమౌళి . మరి మహేష్ బాబు కూడా జక్కన్నతో కలిసి ఇలానే పనిచేయాల్సి ఉంటుంది. ఒకసారి వర్క్ స్టార్ట్ అయిందంటే మహేష్ తన టైం మొత్తాన్ని ఈ డైరెక్టర్ కు అప్పజెప్పాల్సి ఉంటుంది. ప్రిన్స్ మహేష్ బాబు , డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏదేమైనా.. రాజమౌళి చిత్రం పూర్తయ్యే వరకు మహేష్ కు వెకేషన్స్ కష్టమే. నెటిజన్స్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss