iDreamPost
android-app
ios-app

అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ఆసక్తికర పోస్టు!

  • Published Aug 10, 2024 | 11:16 AM Updated Updated Aug 10, 2024 | 11:16 AM

Mahesh Babu: శుక్రవారం మహేశ్ బాబు పుట్టిన రోజుని పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

Mahesh Babu: శుక్రవారం మహేశ్ బాబు పుట్టిన రోజుని పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

  • Published Aug 10, 2024 | 11:16 AMUpdated Aug 10, 2024 | 11:16 AM
అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ఆసక్తికర పోస్టు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రీల్ హీరోనే కాకుండా ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి..రీయల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాక గొప్ప హృదయం ఉన్న హీరో ప్రేక్షకులతో పాటు ఎంతో మంది ప్రజల మదిని గెలిచారు. ఇక నిన్న, ఆగష్టు తొమ్మిదవ తేదీ ఆయన పుట్టిన రోజు అని అందరికి తెలిసింది. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక మహేష్ బాబుకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

శుక్రవారం మహేశ్ బాబు పుట్టిన రోజుని పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తన పుట్టినరోజుని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక పోస్టులో ఆయన రాస్తూ..‘‘నిన్న నా పుట్టినరోజుకు మీరు పంపించిన విషేష్, చూపించిన ప్రేమాభిమానాలు చూసి సంతోషంతో ఉప్పొంగిపోయాను. మీరందరూ ఈ ప్రత్యేకమైన రోజును నాకు మరింత స్పెషల్ గా మారేలా చేశారు. ప్రతి ఏటా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. లవ్‌ యూ’’ అని మహేశ్ బాబు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం  ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.  ఇక మహేశ్ బాబు పోస్టుపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లవ్‌ యూ అన్నా’, ‘ఆల్ వేస్ విత్ యూ అన్న’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

mahesh babu emotional post

ఇక మహేశ్‌ పుట్టిన రోజును పురష్కరించుకుని శుక్రవారం ఆయన నటించిన ‘మురారి’ మూవీ రీ రిలీజ్‌  చేశారు. ఈసందర్భంగా ఆయా థియేటర్ల వద్ద సినీప్రియులు, మహేశ్ అభిమానులు సందడి  చేశారు. మరికొందరు అయితే ఏకంగా థియేటర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక,  మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో ‘గుంటూరుకారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం రెడీ అవుతున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. అంతేకాక మహేశ్‌ బాబుకు 29వ  సినిమా ఇది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş