iDreamPost
android-app
ios-app

Mahesh Babu: SSMB29 నుంచి కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Sep 06, 2024 | 9:57 AM Updated Updated Sep 06, 2024 | 9:57 AM

SSMB29 Latest Update, Mahesh Babu, SS Rajamouli: SSMB29.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

SSMB29 Latest Update, Mahesh Babu, SS Rajamouli: SSMB29.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

Mahesh Babu: SSMB29 నుంచి కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంతవరకు వచ్చింది? హీరోయిన్ ఎవరు? రిలీజ్ ఎప్పుడు? ఏ టైటిల్ పెడుతున్నారు? ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. ఇక మేకర్స్ సైతం వారి క్యూరియాసిటీని అర్థం చేసుకుని మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటారు. కానీ.. ఓ సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఒకే ఒక్క అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీనే SSMB29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

SSMB29.. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ ను నిరాశే ఎదురైంది. అయితే ఇది మిస్ అయినా గానీ.. రాజమౌళి బర్త్ డే(అక్టోబర్ 10) నాడు ఏదో ఒక సాలిడ్ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. దానికోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ నెల చివరి నుంచి చిత్ర యూనిట్ సభ్యులు అందరూ వర్క్ షాప్ లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఇదిలా ఉండగా.. SSMB29 రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫారిన్ ఫారెస్ట్ లో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ను చిత్రీకరించే ప్లాన్ లో ఉన్నట్లు టాక్. ఆ తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ న్యూస్ కాస్త బయటకి రావడంతో.. మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ‘గోల్డ్’, ‘గరుడ’ టైటిల్స్ ఈ చిత్రానికి పెడతారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచరల్ గా  రూపొందబోతోంది ఈ మూవీ. హాలీవుడ్ కు చెందిన స్టార్ టెక్నీషియన్స్ ఈ మూవీకి కోసం పనిచేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మహేశ్ కు జోడీగా ఎవరు నటించబోతున్నారు? విలన్ ఎవరు? ఇతర క్యాస్టింగ్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. చూడాలి మరి జక్కన్న పుట్టినరోజు నాడైనా అప్డేట్ వస్తుందో? రాదో?