iDreamPost
android-app
ios-app

సితార కోసం మహేష్ స్పెషల్ పోస్ట్.. ట్వీట్ వైరల్

  • Published Jul 20, 2024 | 11:38 AM Updated Updated Jul 20, 2024 | 11:38 AM

Mahesh Babu Post About Sitara: సూపర్ స్టార్ మహేష్ , నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహేష్ తన కూతురు గురించి చెప్పుకొస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Mahesh Babu Post About Sitara: సూపర్ స్టార్ మహేష్ , నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహేష్ తన కూతురు గురించి చెప్పుకొస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 20, 2024 | 11:38 AMUpdated Jul 20, 2024 | 11:38 AM
సితార కోసం మహేష్ స్పెషల్ పోస్ట్.. ట్వీట్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ , నమ్రతల దంపతులకు ఎంత ఫాలోయింగ్ ఉందో.. ఇప్పుడు వారి పిల్లలకు కూడా అదే క్రేజ్ ఏర్పడుతుంది. వారిలో ఆల్రెడీ మహేష్ తనయుడు గౌతమ్ ఓ మూవీలో కనిపించి అలరించగా.. ఈ మధ్య అతను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడంటూ కూడా బజ్ నడిచింది. ఇక ఆ తర్వాత మహేష్ , నమ్రతల ముద్దుల కూతురు సితార గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అమ్మడు తనదైన క్రేజ్ ను చూపిస్తూ.. అందరిని మెప్పించేస్తుంది. ఈ క్రమంలో మహేష్ తాజాగా సోషల్ మీడియాలో తన కూతురు గురించి చెప్పుకొస్తూ ఓ స్పెషల్ పోస్ట్ ను షేర్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఇంతకీ మహేష్ షేర్ చేసిన పోస్ట్ ఏంటంటే.. ఈరోజు సితార పుట్టిన రోజు సంధర్బంగా.. హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్ అంటూ సితార ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలియజేశారు. ఇక సితార తల్లి నమ్రత కూడా తన ముద్దుల కూతురుకు విషెస్ తెలియజేస్తూ.. చిన్న నాటి ఫొటోస్ ను , క్యూట్ మూమెంట్స్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న నాటి నుంచి కూడా తన తండ్రి బాటలోనే కొనసాగుతూ.. తండ్రితో పాటు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా.. యాక్టింగ్ , సింగింగ్, పెయింటింగ్ , డ్యాంసింగ్ ఇలా ప్రతి దానిలోనూ తన టాలెంట్ ను అందరికి పరిచయం చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది సితార. ఇక ప్రస్తుతం మహేష్ , నమ్రతల పోస్ట్స్ తో సోషల్ మీడియా వేదికగా అందరూ సితారకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక మహేష్ విషయానికొస్తే.. తాజాగా అనంత్ అంబానీ, రాధిక ల వివాహంలో.. మహేష్ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియా లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. చాలా రోజుల తర్వాత మహేష్ న్యూ లుక్ లో కనిపించడంతో.. ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమాను తీస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే మహేష్ వారసుల ఇండస్ట్రీ ఎంట్రీ గురించి కూడా ఈ మధ్య బాగానే టాక్ వినిపిస్తుంది. ఏమౌతుందో వేచి చూడాలి. మరి ప్రస్తుతం మహేష్ , నమ్రతలు సితారకు బర్త్ డే విషెస్ తెలుపుతూ పెట్టిన పోస్ట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

jojobet girişmarsbahiscasibom