iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మహావీరుడు’ మూవీ!

  • Author singhj Published - 02:48 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 02:48 PM, Mon - 7 August 23
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మహావీరుడు’ మూవీ!

టాలీవుడ్ స్టార్స్​నే కాదు ఇతర చిత్రసీమలకు చెందిన వారినీ ఆదరిస్తారు తెలుగు మూవీ ఫ్యాన్స్. ఈ విషయంలో మిగిలిన ఏ ఇండస్ట్రీ అభిమానులు కూడా తెలుగువారికి సాటిరారనే చెప్పాలి. కోలీవుడ్, శాండల్​వుడ్, మాలీవుడ్​తో పాటు హాలీవుడ్ స్టార్స్​నూ మనోళ్లు అక్కున చేర్చుకుంటారు. థియేటర్లో 3 గంటల పాటు తమను ఎంటర్​టైన్ చేసే సినిమా ఏ భాషకు చెందిందనేది తెలుగు అభిమానులు పట్టించుకోరు. అందుకే పరభాషా నటులు కూడా ఇక్కడ స్టార్​డమ్ సంపాదించుకున్నారు. అలా తెలుగు నాట క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ఎక్కువగా తమిళ సినిమా రంగానికి చెందినవారే ఉంటారు.

విశ్వనాయకుడు కమల్ హాసన్, తలైవా రజినీకాంత్ దగ్గర నుంచి ఎందరో హీరోలకు తెలుగు అభిమానులు తమ గుండెల్లో చోటు కల్పించారు. అలా టాలీవుడ్ ఫ్యాన్స్ ​మనసులను దోచుకున్న మరో నటుడే శివకార్తికేయన్. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో ఈ యంగ్ హీరో తెలుగువారికి చేరువయ్యారు. ఆమధ్య ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రిన్స్’తో మరోమారు ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేశారు శివకార్తికేయన్. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘మహావీరుడు’. మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజైంది.

తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘మహావీరుడు’ మూవీ తెలుగు నాట ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 11 నుంచి తెలుగు, తమిళంలో ‘మహావీరుడు’ అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో సత్య అనే కామిక్ ఆర్టిస్ట్​ పాత్రలో శివకార్తికేయన్ నటించారు. సామాన్యుల కోసం అధికార పార్టీ నిర్మించిన ప్రజాభవనంలో జరిగే ఘోరాలను పిరికివాడైన సత్య ఎలా అడ్డుకున్నాడు? అక్కడి ప్రజల్ని అతడు ఎలా కాపాడాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. మరి.. ఈ మూవీ చూసేందుకు మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom