Krishna Kowshik
ఈ ఫోటోలోని చిన్నారి తెలుగు ప్రేక్షకులు విపరీతంగా అభిమానించే హీరోయిన్. ఆమె తల్లి కూడా నటే. కాకపోతే తెలుగులో ఆమె రాణించలేకపోయింది. ఆ ప్లేసును రీ ప్లేస్ చేసింది ఈ బ్యూటీ.
ఈ ఫోటోలోని చిన్నారి తెలుగు ప్రేక్షకులు విపరీతంగా అభిమానించే హీరోయిన్. ఆమె తల్లి కూడా నటే. కాకపోతే తెలుగులో ఆమె రాణించలేకపోయింది. ఆ ప్లేసును రీ ప్లేస్ చేసింది ఈ బ్యూటీ.
Krishna Kowshik
ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని కోరుకుంటుంది ప్రతి నటీమణి. రెమ్యునరేషన్‌తో పాటు పురస్కారాలు, బిరుదులు మరింత సంతోషాన్నిస్తాయి. ఇవే తమ నటనకు కొలమానంగా భావిస్తుంటారు హీరోయిన్లు. ఇవే ఆమెకు అవకాశాలను తెచ్చిపెడుతుంటాయి. స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్సులు కొల్లగొట్టవచ్చు. పరాయి ఇండస్ట్రీ కూడా రా రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఇక్కడ సత్తా చాటాక.. అక్కడ పాగా వేయాలని ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప కూడా ఈ కోవలోకే వస్తుంది. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పెద్దదైనా.. తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉన్నా.. చిన్న సినిమాలతోనే లాంచ్ అయ్యి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమైంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న తల్లీ కూతుళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్లే. ఇద్దరికీ టాలీవుడ్‌తో మంచి అనుబంధం ఉంది. తల్లి అంత సక్సెస్ కాకపోయినా.. కూతురు మాత్రం రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. ఏకంగా టాలీవుడ్ మూవీ ద్వారానే జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అది కూడా పిన్న వయస్సులోనే. ఇంతకు ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన మహా నటి కీర్తి సురేశ్. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో ముద్దుగుమ్మ. తల్లి మేనక తెలుగులో మూడంటే మూడు చిత్రాల్లోనే నటించింది. అందులో ఒకటి చిరంజీవి నటించిన పున్నమి నాగు. ఆమె కుమార్తెనే ఈ మన సావిత్రి. కీర్తి చైల్ట్ ఆర్టిస్టుగా అలరించి.. గీతాంజలి అనే మలయాళ మూవీతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ మూవీతో తెరంగేట్రం ఇచ్చిన ఈ బ్యూటీ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. నేను లోకల్, అజ్ఞాతవాసి తర్వాత వెంటనే మహానటిలో సావిత్రి పాత్రలో నటించింది.
ఈ పాత్రకు సెంట్ పర్సెంట్ న్యాయం చేసింది. సావిత్రి పాత్రలో ఆమెను తప్ప మరొకర్ని ఊహించుకోలేకపోయారు జనాలు. ఈ సినిమా హిట్టుతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఆచి తూచి అడుగులు వేసింది కీర్తి. తెలుగులో క్యామియో రోల్స్ చేస్తూ.. తనకు నచ్చిన క్యారెక్టర్ రాగానే ఓకే చెప్పేది. అలా మన్మధుడు 2, జాతిరత్నాలు అతిథి పాత్రల్లో మెరిచింది. మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖీ బెడిసి కొట్టినా.. సర్కారు వారి పాటతో మళ్లీ పుంజుకుంది. దసరా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. భోలా శంకర్ మూవీలో తన తల్లితో నటించిన హీరో చిరంజీవితో సోదరిగా నటించింది. అటు తమిళం, మలయాళం సినిమాలు చేస్తూనే.. ఇటు హిందీ ఇండస్ట్రీపై కూడా ఓ కన్ను వేసింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది. హిందీలో బేబీ జాన్ షూటింగ్‌లో పాల్గొంటోంది.