iDreamPost
android-app
ios-app

Manchu Vishnu: అర్షద్ వార్సీ కామెంట్స్‌పై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సీరియస్! ఏమన్నారంటే..?

  • Published Aug 23, 2024 | 1:12 PM Updated Updated Aug 23, 2024 | 5:21 PM

Manchu Vishnu, Arshad Warsi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కాంట్రవర్సీపై తాజాగా రియాక్ట్ అయ్యారు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఆయన ఏమన్నారంటే..?

Manchu Vishnu, Arshad Warsi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కాంట్రవర్సీపై తాజాగా రియాక్ట్ అయ్యారు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఆయన ఏమన్నారంటే..?

  • Published Aug 23, 2024 | 1:12 PMUpdated Aug 23, 2024 | 5:21 PM
Manchu Vishnu: అర్షద్ వార్సీ కామెంట్స్‌పై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సీరియస్! ఏమన్నారంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్ లుక్ బాగోలేదన్నారు అర్షద్ వార్సీ. ప్రభాస్ ను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు బాధేసిందన్నారు. ఆయన లుక్ జోకర్ మాదిరిగా ఉందన్నారు. ఈ కామెంట్స్ మీద పెద్ద దుమారం రేగుతోంది. ప్రభాస్ ను అలా ఎలా అంటారంటూ అటు అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భగ్గుమంటున్నారు. అర్షద్ వార్సీని టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. అర్షద్ పై ఆయన సీరియస్ అయ్యారు.

అర్షద్ వార్సీని హెచ్చరిస్తూ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు మంచు విష్ణు ఒక లెటర్ రాశారు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉంటుందని, అంతమాత్రాన ఏది పడితే అది మాట్లాడటం సరికాదని ఆ లేఖలో రాసుకొచ్చారు. ప్రభాస్ పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు అస్సలు ఆమోదయోగ్యం కానివని అన్నారు. చిన్నచూపు చూసే ఇలాంటి కామెంట్స్ అభిమానులతో పాటు తెలుగు ఫిల్మ్ కమ్యూనిటీ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని లెటర్ లో మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోందని, కాబట్టి సెలెబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ప్రతి మాటకు పవర్ ఉంటుందని, బంధాలను నిలబెట్టడమే కాదు.. కూల్చే శక్తి కూడా వాటికి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు విష్ణు.

భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంచు విష్ణు హెచ్చరించారు. ఇలాంటి కామెంట్స్ చేయడం మానేయాలని అర్షద్ వార్సీకి ఆయన సూచించారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబమని, పరస్పరం గౌరవించుకుంటూ బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంచు విష్ణు లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, ప్రభాస్ ను ఉద్దేశించి అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ స్టార్లు రియాక్ట్ అయ్యారు. అర్షద్ వార్సీ నుంచి ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు వస్తాయని తాను ఊహించలేదని హీరో సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. విమర్శలు చేయడంలో తప్పు లేదు గానీ నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. కుంచిత మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే వ్యాఖ్యలు తాకలేని బిగ్ స్టాట్యూ లాంటివాడు ప్రభాస్ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet