Venkateswarlu
మన్సూర్ అలీఖాన్ మరో సారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిషపై తన నోరు పారేసుకున్నారు. ఆమెపై అసభ్య కామెంట్లు చేశారు...
మన్సూర్ అలీఖాన్ మరో సారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిషపై తన నోరు పారేసుకున్నారు. ఆమెపై అసభ్య కామెంట్లు చేశారు...
Venkateswarlu
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. నెల రోజుల క్రితం ఆయన స్టార్ హీరోయిన్ తమన్నాపై కామెంట్లు చేశారు. జైలర్ సినిమాలో ‘ కావాలయ్యా!’ పాటకు తమన్నా అసభ్యంగా డ్యాన్స్ చేసింది అన్నారు. కాళ్ల మధ్యలో చేతులు పెట్టుకుంటూ నానా రచ్చ చేసిందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
కొంతమంది సినీ ప్రముఖులు ఆయనపై మండిపడ్డారు. అయినా మన్సూర్ తన పద్దతి మార్చుకోవటం లేదు. మళ్లీ హీరోయిన్లపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, త్రిషపై ఆయన అసభ్య కామెంట్లు చేశారు. లియో సినిమాలో తనకు త్రిషను రేప్ చేసే సన్నివేశం ఉంటుందని ఆశించానంటూ వెకిలిగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ త్రిషతో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ, కుదర్లేదు. లియోలో త్రిషతో పాటు కలిసి నటించే అవకాశం వచ్చింది.
దీంతో ఎంతో సంతోషించాను. త్రిషతో కలిసి నటిస్తున్నానా? కచ్చితంగా బెడ్ రూము సీన్లు ఉంటాయి. రోజాను,ఖుష్భూను బెడ్‌పై పడేసినట్లు పడేద్దామని అనుకున్నాను. 109 సినిమాల్లో నేను చేయని రేపా.. త్రిషను నా చేతుల్తో ఆంజనేయస్వామి కొండను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయి.. కాశ్మీర్‌లో మంచులో తీసుకుపోవాలని అనుకున్నాను. కానీ, ఆ ఛాన్సు ఇవ్వటం లేదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. ఆయన ఒకే టీంలో కలిసి పనిచేశారని, మహిళల పట్ల గౌరవం ఉండాలని పేర్కొన్నారు. నేను కచ్చితంగా ఈ ప్రవర్తను ఖండిస్తున్నానని అన్నారు. ఇక, ఇదే సమస్యపై హీరోయినల్ మాళవిక మోహన్ స్పందిస్తూ.. ఇది చాలా దారుణంగా ఉంది. మన్సూర్‌కు మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. ఇది సిగ్గుచేటు. ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి’’ అని న్నారు.
చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది కూడా దీనిపై నేరుగానో.. ట్వీట్ల ద్వారానో స్పందిస్తున్నారు. త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. మన్సూర్ అలీపై మండిపడుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక, నెటిజన్లు కూడా మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి, మన్సూర్ అలీ తరచుగా నటీమణులపై కామెంట్లు చేసి వివాదాల్లో నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is disgusting on so many levels.
It’s shameful enough that this is how this man views women & thinks about them, but then to have the guts(!!) to speak about it this openly & unapologetically, not even worried about repercussions??
Shame on you. Despicable beyond belief. https://t.co/C45Mfzm1Nd— Malavika Mohanan (@MalavikaM_) November 18, 2023