iDreamPost
android-app
ios-app

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ కి కొత్త చిక్కులు! ఇప్పుడు లైగర్ నష్టాలు కూడా!

  • Published Jul 30, 2024 | 6:21 PM Updated Updated Jul 30, 2024 | 6:21 PM

డబుల్ ఇస్మార్ట్ మూవీని సమస్యలు వదలడం లేదు. ఈ మూవీకి కొత్త చిక్కులతో పాటుగా లైగర్ నష్టాలు కూడా తోడైయ్యాయి. దాంతో మేకర్స్ కు కొత్త తలనొప్పి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ మూవీని సమస్యలు వదలడం లేదు. ఈ మూవీకి కొత్త చిక్కులతో పాటుగా లైగర్ నష్టాలు కూడా తోడైయ్యాయి. దాంతో మేకర్స్ కు కొత్త తలనొప్పి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ కి కొత్త చిక్కులు! ఇప్పుడు లైగర్ నష్టాలు కూడా!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాస్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా మేకర్స్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 15కి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఇక హిట్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకుల్లో సహజంగానే బజ్ ఉంటుంది. బిజినెస్ కు ఎలాంటి ఢోకా ఉండదు, థియేటర్ల సమస్యలు కూడా ఉండవు. కొన్ని రోజుల క్రితం డబుల్ ఇస్మార్ట్ మూవీ విషయంలో ఇలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా విరుద్దంగా ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ నష్టాలు తలనొప్పిగా మారాయి.

డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఆగస్ట్ 15 లాంటి క్రేజీ రిలీజ్ డేట్ దక్కడంతో మేకర్స్ సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం ఎక్కువ కాలం లేదు. ఎందుకంటే అదే డేట్ కు మేము కూడా వస్తున్నాం అంటూ విక్రమ్ తంగలాన్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా ‘ఆయ్’ అనే చిత్రం కూడా పోటీపడుతోంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. డబుల్ ఇస్మార్ట్ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. లైగర్ డిజాస్టర్ కావడం పూరిపై ఎక్కడాలేని ప్రెజర్ ను పెంచింది. ఈ మూవీ నష్టాలను సెటిల్ చేసే క్రమంలో రామ్ తో సీక్వెల్ ను స్టార్ట్ చేశాడు పూరి.

డబుల్ ఇస్మార్ట్ మూవీని సమస్యలు వదలడం లేదు. మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ వాడటం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీని బహిష్కరిస్తామంటున్నారు కొందరు. ఇదిచాలదన్నట్లుగా ఇప్పుడు కొత్త తలనొప్పి పూరిని చుట్టుముట్టింది. లైగర్ నష్టాలు పూరిని ఇంకా వదల్లేదు. లైగర్ నష్టాల సెటిల్మెంట్ జరగకపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని అనధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించారట. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఇంకా తెలియరాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు సమస్య సద్దుమణిగినట్లే కనిపిస్తోందట. కాగా.. లైగర్ మూవీని నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు వరంగల్ శ్రీను. సినిమా నిరాశపరచడంతో.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. నష్టాలను సెటిల్ చేయాలని పూరికి వారు విన్నవించుకోగా.. అగ్రిమెంట్ ప్రకారం తమకు నష్టాలతో సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ కు పూరి జగన్నాథ్ అగ్రిమెంట్ చూపించాడని సమాచారం. మరి ఈ చిక్కులన్నీ వీడి.. డబుల్ ఇస్మార్ట్ కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.