iDreamPost
android-app
ios-app

చిన్మయిపై ట్రోల్స్.. భర్త రాహుల్ రియాక్షన్ వైరల్!

  • Published Jul 30, 2024 | 4:41 PM Updated Updated Jul 30, 2024 | 4:41 PM

రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, దర్శకుడిగా, సింగర్ చిన్మయి భర్తగా సుపరిచితం. అయితే తాజాగా చిన్మయి చేసిన పోస్టు.. ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై రాహుల్ స్పందించాడు.

రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, దర్శకుడిగా, సింగర్ చిన్మయి భర్తగా సుపరిచితం. అయితే తాజాగా చిన్మయి చేసిన పోస్టు.. ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై రాహుల్ స్పందించాడు.

  • Published Jul 30, 2024 | 4:41 PMUpdated Jul 30, 2024 | 4:41 PM
చిన్మయిపై ట్రోల్స్..  భర్త రాహుల్ రియాక్షన్ వైరల్!

మీటూ ఉద్యమం మొదలైన నాటి నుండి తన గొంతును వినిపిస్తూనే ఉంది సింగర్ చిన్మయి. చివరకు తనపై జరిగిన లైంగిక దాడి గురించి బహిరంగంగా వెల్లడించింది. తనను ప్రముఖ రచయితు వైరముత్తు సెక్సువల్ అబ్యూస్ చేశాడంటూ ఆరోపణలు చేయడంతో పాటు రాధా రవికి వ్యతిరేకంగా మాట్లాడిన మహిళలకు మద్దతుగా నిలిచినందుకు నాలుగేళ్ల పాటు బ్యాన్ కూడా గురైంది. అలాగే అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రిప్లై ఇస్తుంది. తాజాగా సలార్ నటుడు జాన్ విజయ్ పై విరుచుకు పడింది. అతడు ఓ జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తించడంపై మండిపడింది. కాగా, తాజాగా ఆమె చేసిన ఓ పోస్టుపై విమర్శలు మొదలయ్యాయి. రెండేళ్ల కూతుర్ని రాహుల్ హగ్ చేసుకోకపోతే పాప నో చెప్పగా.. ఫోర్స్ చేయను అని చెప్పాడట. ఈ విషయంలో ఇద్దర్ని హగ్ చేసుకోమని చెప్పలేదంటూ పేర్కొంది.

ఈ ట్వీట్‌పై తండ్రీకూతుళ్ల బంధాన్ని తప్పుగా చూపెడుతున్నారంటూ మండిపడగా.. దీనికి కూడా రిప్లై ఇచ్చింది చిన్మయి. ఇదిలా ఉంటే.. తన భార్యపై వస్తున్న ట్రోల్స్, విమర్శలపై చిన్మయి భర్త, నటుడు కమ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. అలానే తన పోస్టుకి ఓ నెటిజన్ పెట్టిన కామెంట్స్ కు కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ‘ఈరోజు చాలా మంది నాపై కోపంగా ఉన్నట్లున్నారే. మనం తర్వాత తీరిగ్గా వాదించుకుందాం కానీ ముందుగా అందరికీ పెద్ద హగ్. మీరు ఎవరైనా సరే.. ఏం తిట్టినా సరే మీరంటే నాకు ప్రేమ. అలానే నా గురించి ముక్కుసూటిగా చెప్పిన నా భార్య చిన్మయికి కూడా బిగ్ హగ్. పిల్లల ఇష్టం లేకుండా వారిని హగ్ చేసుకోకండి. తను చెప్పింది నాకు కూడా సరిగ్గానే అనిపించింది. వాస్తవానికి మానసికంగా సంఘర్షణలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం అసౌకర్యంగా చిరాకుగా ఉంటుంది.

సింపుల్‌గా చెప్పాలంటే ఎవరినీ విసిగించడం నాకు ఇష్టం ఉండదు. అయితే ఎప్పుడూ వారిని హగ్ చేసుకోకూడదని అర్థం కాదు. కనుక ఇక అందరూ చిల్ అయి ఒలింపిక్స్ చూద్దాం‘ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి సారీ బ్రో.. నన్ను హగ్ చేసుకోవడానికి నేను ఒప్పుకోనను అంటూ కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. దీనికి రాహుల్ రిప్లయ్ ఇచ్చాడు. ‘ట్విట్టర్ హగ్గుకి కూడా ఒప్పుకోవా? ఓకే నో ప్రాబ్లమ్.. నిన్ను బలవంతపెట్టను” అంటూ రాహుల్ రిప్లయ్ ఇచ్చారు. దీంతో వెంటనే “సరదాగా అన్నా బ్రో” అంటూ హగ్ ఎమోజీ పెట్టాడు ఆ నెటిజన్. దీంతో కూల్ ఫన్ సింబల్స్ రిప్లై ఇచ్చాడు రాహుల్. చాలా మంది నెటిజన్లకు సమాధానాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా, చాలా ఓపికగా రిప్లై ఇచ్చిన రాహుల్‌ను పొగిడేస్తున్నారు నెటిజన్లు. రాహుల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. దర్శకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. గార్ల్ ఫ్రెండ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet