iDreamPost
android-app
ios-app

లియో ఫ్యాన్స్ కి షాక్! అక్కడ షోస్ క్యాన్సిల్..

  • Author ajaykrishna Published - 08:09 AM, Sat - 14 October 23
  • Author ajaykrishna Published - 08:09 AM, Sat - 14 October 23
లియో ఫ్యాన్స్ కి షాక్! అక్కడ షోస్ క్యాన్సిల్..

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు. ఫ్యాన్స్ హడావిడితో పాటు షోకు టైమ్ కి పడతాయా లేదా అనే టెన్షన్ కూడా మేకర్స్ లో ఉంటుంది. రిలీజ్ కి ఇంకా ఐదు రోజుల సమయమే ఉంది. ఇలాంటి తరుణంలో లియో మూవీ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.

ఇక లోకేష్ కనగరాజ్ తో విజయ్ కి ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో మాస్టర్ మూవీ తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కాబట్టి.. లియోపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. అందులోనూ లోకేష్.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. సో.. ఇప్పుడు లియోని కూడా అందులో భాగం చేశాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన లియో ట్రైలర్ లో LCU గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కానీ.. అందులో భాగమే అని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఇప్పటికే అనిరుధ్ అందించిన సాంగ్స్, ట్రైలర్ లతో లియో భారీ అంచనాలను ఫ్యాన్స్ లో సెట్ చేసింది.

ఈ క్రమంలో సినిమాకి యూఎస్ఏ లో నిరాశ ఎదురైందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీని రెగ్యులర్ వెర్షన్స్ తో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో RRR కంటే ఎక్కువ ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో లియో రిలీజ్ కి ప్లానింగ్ జరిగింది. కట్ చేస్తే.. యూఎస్ కి లియో ఐమ్యాక్స్ వెర్షన్ కంటెంట్ ఇంకా వెళ్లలేదట. దీంతో ఐమ్యాక్స్ షోలు అన్ని క్యాన్సిల్ చేసి.. టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తున్నట్లు తమిళ వర్గాలలో టాక్ నడుస్తుంది. దీని ప్రకారం.. లియో ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ యూఎస్ లో లేట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. లియో మూవీపై తెలుగులో కూడా మంచి హైప్ నెలకొంది. చూడాలి మరి సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş