స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. రీజియన్ లాంగ్వేజ్ లో రిలీజైతేనే హంగామా ఓ లెవల్ లో ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో.. వివిధ భాషలలో రిలీజ్ అంటే.. హైప్ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన లియో మూవీపై అలాంటి హైప్ నెలకొంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. విజయ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇంతటి హైప్ కి విజయ్ ఒక కారణమైతే.. డైరెక్టర్ లోకేష్ మరో ప్రధాన కారణం.
కట్ చేస్తే.. విజయ్ సినిమాలను తమిళనాడులో ఫ్యాన్స్ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. అందులోనూ పాజిటివ్ టాక్ వస్తే.. అభిమానులను అసలు ఎవరు ఆపలేరు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ అంచనాలు భారీగా సెట్ చేశాయి. అనిరుధ్ అందించిన సాంగ్స్.. చాలా ట్రెండీగా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. అయితే.. లియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విషయంలో విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ.. తాజాగా ఫ్యాన్స్ కి లియో రిలీజ్ విషయంలో ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీ అక్టోబర్ 19న రిలీజ్ అవుతుండగా.. అదే రోజు ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో మార్నింగ్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. కానీ.. కొన్ని నిబంధనలు కూడా విధించడం జరిగింది. లియో మూవీ ప్రొడ్యూసర్.. అక్టోబర్ 19న మార్నింగ్ 4 గంటలకు, 7 గంటలకు స్పెషల్ షోస్ వేసుకునే పర్మిషన్ కోరగా.. అక్టోబర్ 20-24 వరకు ఉదయం 7 గంటల షోలు కంటిన్యూ అవుతాయని గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా మేకర్స్ జాగ్రత్త వహించాలని ప్రభుత్వం హెచ్చరించిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విషయం తెలిసి లియో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.