iDreamPost
android-app
ios-app

ఖైదీ, విక్రమ్ బాటలో లియో.. అసలు లోకేష్ ఏమనుకుంటున్నాడు?

  • Author ajaykrishna Published - 12:38 PM, Wed - 9 August 23
  • Author ajaykrishna Published - 12:38 PM, Wed - 9 August 23
ఖైదీ, విక్రమ్ బాటలో లియో.. అసలు లోకేష్ ఏమనుకుంటున్నాడు?

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇతను సృష్టించిన ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’పై రోజురోజుకి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఓ యూనినర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. కార్తీ, కమల్ హాసన్ ల కెరీర్స్ లో మర్చిపోలేని విజయాలు నిలిపాడు. ఇక ప్రస్తుతం దళపతి విజయ్ తో లోకేష్.. లియో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. విజయ్ – లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అయితే.. ఇది మాస్టర్ కి కొనసాగింపు మాత్రం కాదు. ఎందుకంటే.. లియో ఆల్రెడీ LCU లో భాగమని అందరు అనుకుంటున్నారు. కాకపోతే ఈ విషయంపై ఇప్పటిదాకా లోకేష్ నోటి నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వారసుడుతో మంచి విజయం అందుకున్న దళపతి విజయ్.. ఈసారి లియోగా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టబోతున్నాడట. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. కాగా.. ఇందులో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తోంది. అయితే.. ఇప్పటికే లియో నుండి రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. మరోవైపు సినిమా కథలో ఖైదీ, విక్రమ్ సినిమాలను ఎలా లింక్ చేస్తారనే ఎక్సయిట్ మెంట్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. కానీ.. ఇండస్ట్రీ వర్గాలలో లియో గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లియో కూడా ఖైదీ, విక్రమ్ బాటలోనే రానుందని బజ్ నడుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీ లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అయినప్పటికీ.. ఒక పార్ట్ గా కాకుండా రెండు పార్ట్స్ గా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. లియో క్లైమాక్స్ లో.. ఖైదీ, విక్రమ్ మాదిరే నెక్స్ట్ పార్ట్ కి లింక్ వదులుతారని అంటున్నారు. అయితే.. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న లియోకి.. కొనసాగింపు ఉంటుందని మేకర్స్ నుండి ఎలాంటి కబురు లేదు. సో.. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాకే తెలియనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న లియో మూవీ.. మ్యూజికల్ గా ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ కి అర్థమైంది. అలాగని సినిమాపై ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే.. ఇది లోకేష్ సినిమా. అయితే.. లియోకి పార్ట్ 2 లేదని.. ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ చేసిన ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం లియో 2 పార్ట్స్ అనే ప్రచారానికి.. సతీష్ కుమార్ ట్వీట్ వైరల్ అవుతోంది. అతని ట్వీట్ ప్రకారం.. లియో సెట్స్ తీసేస్తున్నారట. ఆ లెక్కన పార్ట్ 2 లేనట్లే అంటున్నారు. మరి మేకర్స్ మైండ్ లో ఏముందో తెలియాల్సి ఉంది. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetewin girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel