iDreamPost
android-app
ios-app

Lal Salaam: నష్టాలు కాదు.. ఫుల్ ప్రాఫిట్స్! బిగ్ డీల్​తో OTTలోకి ‘లాల్ సలామ్’?

  • Published Feb 12, 2024 | 12:36 PM Updated Updated Feb 12, 2024 | 12:38 PM

కోలీవుడ్ సూపర్​స్టార్ రజినీకాంత్ నటించిన కొత్త చిత్రం ‘లాల్ సలామ్’. గత వారం విడుదలైన ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ ఫిల్మ్ ఓటీటీ డీల్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది.

కోలీవుడ్ సూపర్​స్టార్ రజినీకాంత్ నటించిన కొత్త చిత్రం ‘లాల్ సలామ్’. గత వారం విడుదలైన ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ ఫిల్మ్ ఓటీటీ డీల్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది.

  • Published Feb 12, 2024 | 12:36 PMUpdated Feb 12, 2024 | 12:38 PM
Lal Salaam: నష్టాలు కాదు.. ఫుల్ ప్రాఫిట్స్! బిగ్ డీల్​తో OTTలోకి ‘లాల్ సలామ్’?

తలైవా రజినీకాంత్ నుంచి ఓ మూవీ వస్తోందంటే చాలు.. ఆయన అభిమానులతో సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. స్టైలిష్ యాక్టింగ్, మినిమం గ్యారెంటీ ఎంటర్​టైన్​మెంట్, పంచ్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్, కంటతడి పెట్టించే ఎమోషన్స్, మంచి మెసేజ్​ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు రజినీ. మాస్ పల్స్ తెలిసిన హీరో కాబట్టి వాళ్లకు నచ్చే కాన్సెప్టులను ఎక్కువగా ఎంచుకుంటారు. మాస్​తో పాటు క్లాస్, యూత్, విమెన్ ఆడియెన్స్ కూడా సూపర్​స్టార్ సినిమాలను ఇష్టపడుతుంటారు. అయితే ఆయన తాజా చిత్రం ‘లాల్ సలామ్’ ప్రేక్షకులను నిరాశపర్చింది. తెలుగు నాట ఈ సినిమాకు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. అలాంటి ‘లాల్ సలామ్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట హల్​చల్ చేస్తోంది.

‘లాల్ సలాం’ ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు నెట్​ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మూవీ రిలీజైన 60 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. కానీ అనూహ్యంగా సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడం, ఆడియెన్స్​ను మెప్పించడంలో ఫెయిలవడంతో కేవలం 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని నెట్​ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందని టాక్. కాగా, రజినీకాంత్ చిత్రాలకు తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఆ మధ్య వరుస పరాజయాలతో తలైవా సతమతం అయ్యారు. దీంతో తెలుగులోనూ ఆయన మార్కెట్ పడిపోయింది. అయితే ‘జైలర్’ సినిమా బ్లాక్​బస్టర్ కావడంతో సూపర్​స్టార్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫిల్మ్​ తెలుగు నాట కూడా సూపర్​డూపర్​ హిట్​గా నిలిచింది. ‘జైలర్’ సక్సెస్​తో ‘లాల్ సలాం’ మీద మంచి ఎక్స్​పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ప్రమోషన్స్​ కొరవడం, మూవీ యూనిట్ సరిగ్గా పబ్లిసిటీ చేయకపోవడంతో రజినీ నటించిన సినిమా వస్తోందని కూడా చాలా మందికి తెలియకుండా పోయింది.

విడుదల తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో ‘లాల్ సలామ్’ ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లే ఆడియెన్స్ సంఖ్య మరింతగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని చూసేవాళ్లు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారని తెలుస్తోంది. కొన్ని చోట్ల షోలు రద్దు చేసి డబ్బులు కూడా ఆడియెన్స్​కు రిటర్న్ ఇచ్చేశారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘లాల్ సలాం’ ఓటీటీ స్ట్రీమింగ్​కు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. నష్టాలను పూడ్చుకునేందుకు మూవీ మేకర్స్ సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్​ఫ్లిక్స్​తో బిగ్ డీల్ కుదుర్చుకున్నారని వినికిడి. ఈ డీల్​తో నష్టాలు కాదు.. ఫుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయని కోలీవుడ్ టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా, రజినీ అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’లో యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరి.. ‘లాల్ సలాం’ మూవీ మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: OTTలోకి ఏకంగా 21 సినిమాలు.. ఆ రెండింటిపైనే అందరి ఆసక్తి