Venkateswarlu
అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో సినిమాకు మంచి స్పందన వచ్చింది...
అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో సినిమాకు మంచి స్పందన వచ్చింది...
Venkateswarlu
శ్రీకాంత్- రాహుల్ విజయ్- శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ప్రేక్షకులనుంచే గాక, రివ్యూవర్ల దగ్గరనుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మలయాళ చిత్రం ‘ నాయట్టు’కు తెలుగు రీమేక్‌గా కోట బొమ్మాళి పీఎస్ తెరకెక్కింది. మాతృతకతో పోలీస్తే తెలుగులో చాలా మార్పులు చేశాడు దర్శకుడు తేజమణి. రీమేక్ అన్న భావన ఎక్కడా కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో రెండు పాటలు ఉన్నాయి.
లింగి లింగి అన్న పాట సోషల్ మీడియాలో ఎంత పాపులారిలీ వచ్చిందో అందరికీ తెలిసిందే. సంగీతం, ఎడిటింగ్, కెమెరా పనితనం ఇలా అన్ని విషయాల్లో సినిమా శభాష్ అనిపించుకుంది. మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం … కోట బొమ్మాళి పీఎస్ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగా.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇలాంటి వసూళ్లు సాధించటం గ్రేట్ అని చెప్పొచ్చు. మౌత్ పబ్లిసిటీ పెరిగితే..రెండో రోజునుంచి కలెక్షన్లు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
కోట బొమ్మాళి పీఎస్ కథేంటంటే..
రామకృష్ణ( శ్రీకాంత్), రవి (రాహుల్ విజయ్), కుమారి(శివానీ రాజశేఖర్)లు కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తూ ఉంటారు. కుమారిని బావ వరుస అయ్యే ఓ వ్యక్తి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ఎలక్షన్ టైం. అధికార పార్టీ అండ చూసుకుని అతడు వేధింపులు ఎక్కువ చేస్తాడు. దీంతో ఆమె తను పని చేసే స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేస్తుంది. ఆమె బావను స్టేషన్‌కు పిలిస్తారు. అక్కడ రామకృష్ణ, రవిలకు కుమారి బావకు గొడవ అవుతుంది. కుమారి బావ, అతడి అనుచరులు దీన్ని మనసులో పెట్టుకుంటారు.
కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ రోజు రామకృష్ణ, రవి, కుమారిలు ఓ పెళ్లికి వెళతారు. అక్కడ రామకృష్ణ, రవిలు బాగా తాగి ఎంజాయ్ చేస్తారు. అర్థరాత్రి పెళ్లినుంచి జీపులో తిరిగి వస్తూ ఉంటారు. ఈ టైంలో జీపు ఓ బైకర్‌ను ఢీకొడుతుంది. అతడు అక్కడికక్కడే చనిపోతాడు. జీపులో ఉన్న ముగ్గురు బైకర్ హత్య కేసులో ఇరుక్కుంటారు. ఇక, ఆ యాక్సిడెంట్ వారి జీవితాల్ని ఎలా మార్చేసింది? ముగ్గురూ ఆ హత్య కేసునుంచి ఎలా బయటపడ్డారు అన్నదే మిగిలిన కథ. మరి, కోట బొమ్మాళి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.