iDreamPost
android-app
ios-app

రోజూ ఆ పని చేసేవాడినే పెళ్లి చేసుకుంటాను…హిట్-2 హీరోయిన్

  • Published Mar 22, 2024 | 2:56 PM Updated Updated Mar 22, 2024 | 2:56 PM

komali Prasad: అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటారు. అలానే హీరోయిన్లు కూడా తమను పెళ్లాడే వ్యక్తికి ఉండాల్సిన గుణగణాల గురించి చెబుతుంటారు. తాజాగా హిట్ 2 హీరోయిన్ కూడా తనను పెళ్లాడే వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది.

komali Prasad: అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటారు. అలానే హీరోయిన్లు కూడా తమను పెళ్లాడే వ్యక్తికి ఉండాల్సిన గుణగణాల గురించి చెబుతుంటారు. తాజాగా హిట్ 2 హీరోయిన్ కూడా తనను పెళ్లాడే వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది.

  • Published Mar 22, 2024 | 2:56 PMUpdated Mar 22, 2024 | 2:56 PM
రోజూ ఆ పని చేసేవాడినే పెళ్లి చేసుకుంటాను…హిట్-2 హీరోయిన్

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక.  అందుకే తమ కాబోయే భాగస్వామి  గురించి యువత ఎన్నో ఊహించుకుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే తమకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటుంది. ఇలా కేవలం సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ తమ భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. తరచూ కొందరు హీరోయిన్లు తమను పెళ్లాడే వ్యక్తి గుణగణాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ కూడా తనను వివాహమాడే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పింది. ఇంతకీ ఆ హీరోయిన్, ఎవరు, ఆమెకు కాబోయే భర్త ఎలా ఉండాలని చెప్పిందో, ఆ వివరాలు తెలుసుకుందాం..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఉండే వారు. అలా చాలా మంది తెలుగమ్మాయిలు తమదైన నటనతో ఆకట్టుకునేవారు. కానీ రోజు రోజుకి తెలుగు హీరోయిన్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా తక్కువ మంది తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కోమ‌లి ప్ర‌సాద్‌ ఒకరు. ‘నేను సీతాదేవి’(2016) అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్‌’, ‘సెబాస్టియన్‌ పిసి524’,  ‘రౌడీ బాయ్స్‌’ వంటి సినిమాల్లోనూ నటించింది. కానీ కోమలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

అయితే హిట్‌– 2’ సినిమా కోమలి ఖాతాలో హిట్‌ పడింది. ఆర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ టీమ్ ప్రమోషన్లో బిజీ బిజీగా ఉంది.  హీరోయిన్ కోమాలి మీడియాతో మాట్లాడింది. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కోమలి అన్నారు. మన దర్శకనిర్మాతలు టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల కోసం వెతుకున్నారని.. అవకాశం ఉన్న ప్రతి చిత్రంలోనూ ఇక్కడి అమ్మాయిలనే హీరోయిన్లుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

తనకు వచ్చిన ప్రతి అవకాశం కూడా తెలుగమ్మాయిని అనే వచ్చిందని, ఏదో సక్సెస్‌ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేం కదా? తాను కూడా తెలుగమ్మాయిని..అలానే చెపుకుంటానని, ఇకపై కూడా అలానే ఉంటానని తెలిపారు. ఇక తన లవ్‌స్టోరీ గురించి చెబుతూ.. అందరిలాగానే తాను కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయిందని తెలిపింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని ఆమె అన్నారు. అలానే తనకు డేటింగ్‌ అంటే నచ్చదని చెప్పుకొచ్చింది. పద్దతిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానారు.  రోజుకు రెండు జోకులు..ఒక పూట బిర్యానీ తినిపించేవాడు దొరికితే చాలు పెళ్లి చేసుకుంటానని(నవ్వుతూ) ఈ తెలుగు బ్యూటీ చెప్పింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş