iDreamPost
android-app
ios-app

వారు నన్నేం పీకలేరు! ట్రోలర్స్ పై కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • Author ajaykrishna Published - 03:21 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 03:21 PM, Thu - 6 July 23
వారు నన్నేం పీకలేరు! ట్రోలర్స్ పై కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకొని సెలబ్రిటీ హోదా పొందిన వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఇతని గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక పలు సినిమాలలో నటించిన ఆర్పీ.. అ తర్వాత డైరెక్టర్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆఖరికి ఎందులోనూ ముందడుగు వేయలేక బిజినెస్ రంగంలో అడుగుపెట్టాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్ లో తన రెస్టారెంట్ బిజినెస్ ని డెవలప్ చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే చాలా చోట్ల తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బ్రాంచీలు ఓపెన్ చేసి సూపర్ సక్సెస్ చవిచూశాడు.

ఈ క్రమంలో మెల్లగా తన బిజినెస్ ని హైదరాబాద్ లోనే కాకుండా ప్రధాన నగరలైన విశాఖపట్నం, అనంతపురం, బెంగుళూరు ఏరియాలలో బ్రాంచీలు ఓపెన్ చేశాడు. తన బిజినెస్ ని మంచిగా విస్తరించుకుంటున్నాడు. సరే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ద్వారా అయినా మంచి జీవితం నిర్మించుకుంటున్నాడు.. అనుకుంటున్న టైంలో తన బిజినెస్ గురించి ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఇటీవల రియాక్ట్ అయ్యాడు. ఇక ఆర్పీ తన బిజినెస్ ని డామేజ్ చేయాలని చూస్తున్న వారిపై విరుచుకుపడుతూ పలు సంచలన కామెంట్స్ చేయడం గమనార్హం.

కొంతమంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ని దెబ్బ తీయాలని చూస్తున్నారని.. అందుకే తమ బిజినెస్ గురించి నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆర్పీ చెప్పాడు. అదీగాక కొందరు ఉద్దేశపూర్వకంగా పెయిడ్ బ్యాచ్ లను తయారుచేసి వ్యాపారంపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఆర్పీ ఇంకా మాట్లాడుతూ.. “కొందరు మా చేపల పులుసు చూడటానికి బాగుంటుంది గానీ రుచి బాగుండదని కామెంట్స్ చేశారు. ఒకవేళ మా చేపల పులుసు టేస్ట్ బాగోలేకపోతే రోజూ కొనడానికి ఇంతమంది రారు. నేను పులుసు కోసం నెల్లూరు నుండి చేపలను తెప్పిస్తున్నాను. పైగా డిమాండ్ కి సరిపడా సప్లై చేయలేకపోతున్నాం. అంత డిమాండ్ ఉంది. నా సక్సెస్ చూసి చాలామంది కుళ్ళుతో ఇలా చేస్తున్నారు. వారందరికీ ఒకటే చెప్తాను.. నన్నేం పీకలేరు” అని ఆర్పీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom