iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా సంచలనాత్మక వసూళ్లతో అదరగొడుతున్న కెజిఎఫ్ 2 ఓటిటి ప్రీమియర్ డేట్ ఆల్మోస్ట్ లాక్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మే 13న KGF Chapter 2, Amazon Prime Videoలో రావొచ్చనే లీక్ గట్టిగానే తిరుగుతోంది. ఇదెంత వరకు నిజమో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని అంశాలు గమనించవవచ్చు. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన డిజిటల్ డేట్ వచ్చే సమయానికి కెజిఎఫ్ 2 థియేట్రికల్ రిలీజ్ సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుని ఉంటుంది. ఆల్రెడీ ఉత్తరాదిలో మినహాయించి వీక్ డేస్ లో కలెక్షన్ల పరంగా చెప్పుకోదగ్గ తగ్గుదల ఆల్రెడీ మొదలయ్యింది
అంటే దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్నట్టే. ఎంత వసూళ్ల సునామి సృష్టించినా మరీ యాభై రోజులు నాన్ స్టాప్ గా ఆడే సీన్ అయితే లేదు. అంత బాహుబలికే ఫిఫ్టీ డేస్ ఫీట్ అతి కష్టం మీద సాధ్యమయ్యింది. పైగా ఈ నెలాఖరున ఆచార్య వస్తుంది. మే 12న మహేష్ బాబు సర్కారు వారి పాటతో దిగుతాడు. సో థియేటర్ల కౌంట్ సౌత్ లో గణనీయంగా తగ్గిపోతుంది. ఆల్రెడీ నైజామ్ తో సహా కెజిఎఫ్ 2 వీక్ డే కలెక్షన్లలో డ్రాప్ కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాగా మంగళ బుధవారాలు కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ చేసేలా కనిపించం లేదు. అందుకే OTT కనక త్వరగా వస్తే భారీ ఎత్తున క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పైగా ప్రైమ్ అగ్రిమెంట్ ఇరవై, ముప్పై లేదా నలభై అయిదు లేదా యాభై రోజుల ఇలా ఒక నిర్దిష్టమైన గడువుతో ఉంటుంది. ఒక్కసారి లాక్ అయితే ఎవరి మాటా వినదు. ఈ కారణంగానే పుష్ప పార్ట్ 1 భీభత్సంగా ఆడుతున్నా సరే ఒప్పందం ప్రకారం 20 రోజులకే స్ట్రీమింగ్ చేసింది. మరి హోంబాలే ఫిలింస్ తమ సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కెజిఎఫ్ 2లో అసలు టైటిల్స్ పడకముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్ అమెజాన్ ప్రైమ్ అని వేసేశారు కాబట్టి మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రిపీట్ రన్స్ కోసం పదే పదే థియేటర్ కు వెళ్లలేని వాళ్లకు డిజిటల్ లో వస్తే పండగే.