iDreamPost
android-app
ios-app

కేజీఎఫ్ బ్యూటీ.. బాలయ్యతో టాలీవుడ్ ఎంట్రీ?

  • Author ajaykrishna Updated - 09:40 AM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 09:40 AM, Mon - 11 September 23
కేజీఎఫ్ బ్యూటీ.. బాలయ్యతో టాలీవుడ్ ఎంట్రీ?

పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న బ్యూటీ.. ఓకే అంటే ఎన్నో అవకాశాలు క్యూ కడతాయి. పైగా ఒకే సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు వెయిట్ చేసింది. కట్ చేస్తే.. ఐదేళ్లలో చేసింది రెండే సినిమాలు. ఇది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి వికీపీడియా. 2018లో కేజీఎఫ్ మూవీతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రీనిధి.. ఆ తర్వాత 2022లో కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యేవరకు వేరే ఏ సినిమా చేయలేదు. కేజీఎఫ్ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ లభించింది. కానీ.. హీరోయిన్ గా శ్రీనిధి మాత్రం ఇండస్ట్రీలో బిజీ కాలేకపోయింది. కేజీఎఫ్ 2 తర్వాత కోబ్రా అని ఒకే ఒక్క సినిమా చేసింది.

సాధారణంగా పాన్ ఇండియా హిట్స్ పడితే.. హీరోయిన్స్ ఎలా బిజీ అయిపోతారో చూస్తుంటాం. కానీ.. మోడలింగ్ నుండి వచ్చిన ఈ అమ్మడు చాలా డిఫరెంట్. వరుస పెట్టి సినిమాలు చేయకుండా ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. పైగా శ్రీనిధి కంటే వెనుక వచ్చిన వారంతా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. కట్ చేస్తే.. కేజీఎఫ్ తర్వాత వెంటనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని అందరు ఎక్స్ పెక్ట్ చేశారు. అనూహ్యంగా ఏ హీరోతో కూడా ఓకే చేసినట్లు సమాచారం లేదు. కానీ.. ఇప్పుడు శ్రీనిధి టాలీవుడ్ డెబ్యూకి అవుతున్నట్లు తెలుస్తోంది.

అదికూడా నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన సినిమాతో రానుందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు బాబీతో ఓ సినిమా ఓకే చేశాడు. ఆ సినిమా ఫ్యామిలీ అండ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని అంటున్నారు. కాగా.. ఆ సినిమా కోసం శ్రీనిధిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నారు. అలా మొత్తానికి బాలయ్యతో కేజీఎఫ్ భామ తెలుగు డెబ్యూ జరుగుతుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి శ్రీనిధి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss