iDreamPost
android-app
ios-app

లేడీ ఫ్యాన్ దెబ్బకు గడగడలాడిపోయిన కార్తికేయ.. ఏం చేసిందంటే..?

  • Author singhj Published - 04:28 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 04:28 PM, Sat - 26 August 23
లేడీ ఫ్యాన్ దెబ్బకు గడగడలాడిపోయిన కార్తికేయ.. ఏం చేసిందంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. యాక్టింగ్ టాలెంట్​తో పాటు డ్యాన్సులు, ఫైట్లు చేయగలిగే సత్తా ఉండాలి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ పోవాలి. అదే టైమ్​లో కాసింత అదృష్టం కూడా కలసిరావాలి. టాలెంట్​కు లక్ తోడైతే ఇక వారిని ఆపడం కష్టమే. టాలీవుడ్​ యంగ్ హీరోల్లో ఒకరైన కార్తికేయకు కూడా ఇప్పుడు అదృష్టం అవసరం ఏర్పడింది. ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు కార్తికేయ. ఈ మూవీతో యూత్ ఆడియెన్స్​లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

‘ఆర్ఎక్స్ 100’ సూపర్ హిట్ కావడంతో కార్తికేయ చేసే తర్వాతి సినిమాలపై మంచి బజ్ ఏర్పడింది. కానీ అవేవీ ‘ఆర్ఎక్స్ 100’ స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారాయన. కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ సినిమా ఇటీవలే రిలీజై మిక్స్​డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఎంటర్​టైనింగ్​గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రంతోనైనా కార్తికేయకు మంచి హిట్ పడుతుందేమో చూడాలి. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసినా హీరో ప్రమోషన్స్ ఆపడం లేదు. ఈ మూవీని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు సాధ్యమైనంతగా కార్తికేయ ప్రయత్నిస్తున్నారు.

‘బెదురులంక 2012’ ప్రమోషన్స్​లో జోరు పెంచిన కార్తికేయ.. దీని కోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం నిన్న ట్విట్టర్​లో కార్తికేయ ప్రమోషన్స్ చేశారు. ‘ఆస్క్ కార్తికేయ’ అనే పేరుతో అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పోయారీ యంగ్ హీరో. అయితే ఒక లేడీ ఫ్యాన్ కార్తికేయను గడగడలాడించింది. తనకు రిప్లయ్ ఇస్తారా? లేదా చేయి కోసుకోవాలా? అంటూ హీరోను బ్లాక్​మెయిల్ చేసింది. అయితే దీనికి కార్తికేయ స్పందిస్తూ.. ఒద్దొద్దు, అలా చేయకంటూ రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఆ లేడీ ఫ్యాన్ శాంతించింది. హీరోకు థ్యాంక్యూ అని రిప్లయ్ పెట్టింది. అయితే ఇది సరదా సంభాషణే అని అక్కడ ఉన్న ఫొటోను చూస్తే అర్థమవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom