iDreamPost
android-app
ios-app

Kamindu Mendis: శ్రీలంకలో మరో బ్రాడ్ మన్.. ఇతని ఊచకోతకు వణికిపోతున్న బౌలర్లు!

Kamindu Mendis Another Bradman For Sri Lanka: ఒక్క కుర్రాడు శ్రీలంక టెస్ట్ క్రికెట్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నాడు. తన దూకుడుతో శ్రీలంకకు ఒక వరంలా మారాడు. అతను ఇప్పుడు మరో డాన్ బ్రాడ్ మన్ అంటూ క్రికెట్ విశ్లేషకులు కితాబు ఇస్తున్నారు.

Kamindu Mendis Another Bradman For Sri Lanka: ఒక్క కుర్రాడు శ్రీలంక టెస్ట్ క్రికెట్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నాడు. తన దూకుడుతో శ్రీలంకకు ఒక వరంలా మారాడు. అతను ఇప్పుడు మరో డాన్ బ్రాడ్ మన్ అంటూ క్రికెట్ విశ్లేషకులు కితాబు ఇస్తున్నారు.

Kamindu Mendis: శ్రీలంకలో మరో బ్రాడ్ మన్.. ఇతని ఊచకోతకు వణికిపోతున్న బౌలర్లు!

క్రికెట్ లో ఫార్మాట్ ని బట్టి ఆట, ఆటగాళ్ల దూకుడు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా టెస్టు అనగానే అంతా కాస్త టైమ్ తీసుకుని ఆడేందుకు మొగ్గు చూపిస్తూ ఉంటారు. 5 రోజులు జరగాల్సిన మ్యాచ్ కాబట్టి కాస్త ఆచి తూచి అడుగులేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి టెస్టు క్రికెట్లో కొందరు కొదమ సింహాల్లాగా విజృంభించేవాళ్లు. ఇప్పుడు కూడా అలాంటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఆ కేటగిరీలో ఒక లెజెండ్ ని మాత్రం భర్తీ చేయడం అంత ఈజీ కాదు అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఆయన మరెవరో కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన “ది డాన్ బ్రాడ్ మన్”. ఆయన మైదానంలో అడుగుపెడితే ఎంతటి బౌలర్ అయినా వెనుకడుగు వేయాల్సిందే. ఆయన బ్యాటు పట్టుకుంటే.. అవతలి టీమ్ ఫీల్డర్లు బౌండరీల మీద కాపలా కాయాల్సిందే. ఇప్పుడు ఓ కుర్రాడు తన ఆటతో అలాంటి డాన్ బ్రాడ్ మన్ ని గుర్తు చేస్తున్నాడు. అదే రేంజ్ లో ప్రత్యర్థుల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అసలు ఆ తోపు ప్లేయర్ ఎవరు? అతను సృష్టిస్తున్న విధ్వంసం ఏంటో.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

క్రికెట్ హిస్టరీలో శ్రీలంకకు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. అయితే అదంతా అప్పుడు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పసికూనలు కూడా లంకను చూసి జాలిపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అలాంటి లంకకు ఒక కుర్రాడు వెన్నెముకగా నిలబడ్డాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు.. కామిందు మెండిస్. శ్రీలంక టెస్టు క్రికెట్ ను మరో స్థాయికి చేర్చేలా ఈ కుర్రాడి ఆట ఉండటం విశేషం. ప్రపంచ టెస్టు క్రికెట్ ని శాసించే సత్తా అతనిలో ఉంది అని హేమాహేమీలు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే అతను మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వరద పారుతోంది. పాతికేళ్ల వయసులోనే టెస్టు క్రికెట్ లో అతని దూకుడు చూసి దిగ్గజాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ది డాన్ బ్రాడ్ మన్ ని దాటేసేలా కామిందు మెండిస్ కనిపిస్తున్నాడు.

ఇదంతా ఏదో రెండు ఇన్నింగ్సులు చూసి చెప్తున్న మాటలు కావు. అతని ప్రదర్శన, అతని నిలకడ, అతని దూకుడు చూసి చెప్తున్న మాటలు. అయినా అందుకు బలం చేకూర్చేందుకు కావాల్సిన గణాంకాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. తాజాగా శ్రీలంక- న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుతో కామిందు మెండిస్.. ఏకంగా బ్రాడ్ మన్ కి చెందిన రెండు రికార్డులను సమం కూడా చేశాడు. ఆ రికార్డులు ఏంటంటే.. అత్యంత వేగంగా టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా అవతరించాడు. కేవలం 13 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ ని సాధించి.. బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్ క్రికెటర్ గా కామిందు మెండిస్ రికార్డులకెక్కాడు.

అంతేకాకుండా.. వినోద్ కాంబ్లీ పేరిట ఉన్న 14 ఇన్నింగ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. మరో రికార్డు ఏంటంటే.. కేవలం 13 ఇన్నింగ్స్ లోనే 5 టెస్టు శతకాలు నమోదు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఫహద్ అలామ్స్ 22 ఇన్నింగ్స్ రికార్డును కామిందు మెండిస్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా.. 13 ఇన్నింగ్స్ లో 5 టెస్టు శతకాలు నమోదు చేసిన ది డాన్ బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు కామిందు గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం అతని దూకుడు స్వభావమే. మైదానంలోకి దిగితే ప్రత్యర్థులు ఎవరైనా ఊచకోత కోసేస్తున్నాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తేనే అతని యావరేజ్ చూస్తే ఎంత ప్రమాదకరమో చెప్పచ్చు. 79.36 యావరేజ్ తో టెస్టుల్లో ఈ పాతికేళ్ల కుర్రాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అందరూ లంకకు మరో బ్రాడ్ మన్ దొరికాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కామిందు మెండిస్ ఆట మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.