Swetha
HYDRA Demolitions In Pathabasthi: హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని పాత బస్తిలో హై టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HYDRA Demolitions In Pathabasthi: హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని పాత బస్తిలో హై టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్లు సామాన్యుల పీకల మీద కూర్చుంటున్నాయి. ఉన్నపలంగా పెట్టా బేడా సర్దుకుని ఇళ్ళు ఖాళీ చేయాల్సిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు. మా ఇళ్ల జోలికి రావొద్దు అంటూ ప్రజలంతా రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన కన్నా ఆదేశాలే ముఖ్యమని హైడ్రా హై స్పీడ్ తో దూసుకుపోతుంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని పాత బస్తీ ఏరియాలో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. అత్తాపూర్ లోని ప్రతి ఇంటిని మార్కింగ్ చేశారు. చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో.. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉంటున్న ప్రజలంతా కూడా.. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా నిన్నటి వరకు .. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తుంటే.. పాత బస్తీ మెల్లగా ఖాళీ అవుతుంది. ఇంత జరుగుతున్నా ఓవైసీ బ్రదర్స్ మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు.
హైడ్రా కూల్చివేతలతో పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే మూసీని ఆనుకుని ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఏ క్షణమైనా హైడ్రా బుల్డోజర్లు ఆ ఇళ్లను కూల్చివేయొచ్చు. దీనితో ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారు.. మెల్లగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కొంతమంది రోడ్ల పైన విలపిస్తూ.. ఇళ్లను కూల్చొద్దు అంటూ ప్రాధేయ పడుతున్నారు. అయితే ఒవైసి బ్రదర్స్ పేదల ఇళ్ల గురించి మాత్రం స్పందించడం లేదు. కానీ ఫాతిమా కాలేజ్ విషయంలో మాత్రం వెంటనే స్పందించారు. నోటీసులు ఇచ్చిన వెంటనే.. నెక్లెస్ రోడ్ ను కూల్చివేస్తారా.. చాలా ప్రభుత్వ భవనాలు బఫర్ జోన్ లో ఉన్నాయ్.. వాటిని కూల్చేస్తారా.. మమ్మల్ని చంపిన తర్వాత మాత్రమే మా కాలేజ్ జోలికి రండి అంటూ మండి పడ్డారు. మరి ఇప్పుడు ఆ ఆగ్రహం ఏమై పోయింది. పేదల విషయంలో ఒవైసి బ్రదర్స్ నోరు మెదపడం లేదు. చెరువు మధ్యలో కట్టిన కాలేజీల విషయంలో స్పందించిన వారు.. ఇప్పుడెందుకు స్పందించడం లేదు అని.. అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒవైసి ఎక్కడా అంటూ నినాదాలు చేస్తున్నారు.
కొంతమంది భయంతో ఇప్పుడే ఖాళీ చేసేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి ఇళ్ల కోసం పోరాటం చేస్తూ.. ప్రాణం పోయిన ఇక్కడ నుంచి కదలం అంటూ.. ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఫాతిమా కాలేజీని కాపాడుకోవడం కోసమే.. ఇంత మంది పేదలు ఇళ్ళు పోతున్నా కూడా పట్టించుకోవడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఒవైసి బ్రదర్స్ స్పందిస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లను కూల్చేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. మరి అక్కడ ఏ క్షణమైనా హైడ్రా బొల్డోజర్లు కూల్చివేతలు స్టార్ట్ చేయొచ్చు.. అప్పుడు ఎలాంటి ఉద్రిక్తత నెలకుంటుందో చూడాలి. పేద, పెద్ద అని తేడా లేకుండా హైడ్రా క్షణాల్లో భవనాలను నేలమట్టం చేస్తుంది. ఈ శని ఆది వారాల్లోనే మూసి పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.