iDreamPost
android-app
ios-app

వీడియో: అశ్విన్​తో కలసి పంత్ మాస్టర్ ప్లాన్.. బిత్తరపోయిన బంగ్లా కెప్టెన్​!

  • Published Sep 27, 2024 | 6:01 PM Updated Updated Sep 27, 2024 | 6:01 PM

Rishabh Pant, Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంత స్మార్ట్ అనేది తెలిసిందే. వికెట్ల వెనుక ఉండి క్యాచ్​లు, స్టంపౌట్​లు చేస్తూనే.. అవసరమైనప్పుడు బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలాగే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు.

Rishabh Pant, Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంత స్మార్ట్ అనేది తెలిసిందే. వికెట్ల వెనుక ఉండి క్యాచ్​లు, స్టంపౌట్​లు చేస్తూనే.. అవసరమైనప్పుడు బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలాగే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు.

  • Published Sep 27, 2024 | 6:01 PMUpdated Sep 27, 2024 | 6:01 PM
వీడియో: అశ్విన్​తో కలసి పంత్ మాస్టర్ ప్లాన్.. బిత్తరపోయిన బంగ్లా కెప్టెన్​!

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంత స్మార్ట్ అనేది తెలిసిందే. బ్యాట్ పట్టుకొని క్రీజులోకి దిగితే భారీ బౌండరీలు, సిక్సులతో అపోజిషన్ టీమ్​ బౌలర్లను వణికిస్తాడు. అదే వికెట్ల వెనుక ఉన్నాడా.. క్యాచ్​లు, స్టంపింగ్​లు, రనౌట్​లు చేస్తూ బ్యాటర్లకు దడ పుట్టిస్తుంటాడు. అవసరమైనప్పుడు బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతడు సిద్ధహస్తుడు. అలాంటోడు మరోమారు మాస్టర్​ ప్లాన్ వేసి ఓ బ్యాటర్​ను పెవిలియన్​కు పంపించాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​తో కలసి బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో పనిపట్టాడు పంత్. వీళ్లు కొట్టిన దెబ్బకు ప్రత్యర్థి జట్టు సారథి బిత్తరపోయాడు. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం..

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్​ తొలి రోజు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ అపోజిషన్ టీమ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. అయితే ఆ జట్టుకు ఆరంభంలోనే వరుస షాక్​లు తగిలాయి. పేసర్ ఆకాశ్​దీప్ భీకరంగా బౌలింగ్ చేయడంతో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది బంగ్లా. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు సారథి నజ్ముల్ షంటో (31) బాగానే ఆడాడు. వరుస బౌండరీలతో భారత్​పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్​లో మోమినుల్ హక్ (40 నాటౌట్) కూడా దీటుగా ఆడుతుండటంతో టీమిండియా మీద ఒత్తిడి పెరిగింది. ఇద్దరి మధ్య 51 బంతుల్లో 100 పరుగుల పార్ట్​నర్​షిప్ నెలకొంది. ఈ సమయంలో కీపర్ పంత్ మంచి ప్లాన్ వేశాడు. అశ్విన్​కు ఎక్కడ బౌలింగ్ చేయాలో చెప్పి బ్రేక్ త్రూ అందించాడు.

షంటో సాలిడ్ డిఫెన్స్​తో ఆకట్టుకుంటుండటంతో కెప్టెన్ రోహిత్ అతడి కోసం షార్ట్ లెగ్​లో శుబ్​మన్ గిల్​ను పెట్టాడు. బాల్ అంతగా టర్న్ కాకపోయినా బ్యాటర్​ను కన్​ఫ్యూజ్ చేయాలని అనుకున్నాడు. ఈ ఫీల్డింగ్​కు తగ్గట్లు అశ్విన్ బౌలింగ్ చేస్తూ పోయాడు. అయినా వికెట్ రాకపోవడంతో కీపర్ పంత్ తన మైండ్​కు పని చెప్పాడు. అశ్విన్​ను ఫుల్ లెంగ్త్​లో ఫ్లైటర్ డెలివరీస్ స్లోగా వేయమని అన్నాడు. అంతే అశ్విన్ నెక్స్ట్ బాల్ పంత్ చెప్పినట్లే వేయడం, దాన్ని డిఫెన్స్ చేయబోయి షంటో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం క్షణాల్లో అయిపోయాయి. మొదట రోహిత్ షార్ట్ లెగ్ ఫీల్డర్ పెట్టి షంటో మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతడి బ్యాటింగ్​ స్టైల్​ను అంచనా వేసి పంత్ కాస్త పైకి బాల్ వేయాలని అశ్విన్​కు సూచించాడు. ఇలా ముగ్గురు భారత స్టార్ల మాస్టర్​ప్లాన్​కు బంగ్లా కెప్టెన్ క్రీజును వీడాల్సి వచ్చింది. అతడు మరింత సేపు క్రీజులో ఉంటే ప్రమాదంగా మారేది. మరి.. షంటోకు పంత్ ఇచ్చిన మాస్టర్​ స్ట్రోక్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.