iDreamPost
android-app
ios-app

WhatsAppలో సూపర్ ఫీచర్! ఇక నుంచి వైద్య సేవలు కూడా.. ఎలా అంటే?

  • Published Sep 28, 2024 | 2:42 PM Updated Updated Sep 28, 2024 | 2:42 PM

WhatsApp: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం బాగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది.

WhatsApp: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం బాగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది.

WhatsAppలో సూపర్ ఫీచర్! ఇక నుంచి వైద్య సేవలు కూడా.. ఎలా అంటే?

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో అద్భుతాలు చేయవచ్చు. ఇది నేటి కాలానికి గేమ్ ఛేంజర్ గా మారిపోయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ఇది మనుషుల పనిని తగ్గించి సులభం చేస్తుంది. మెషీన్స్ మనుషుల్లా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి AI సహాయపడుతోంది. ఒకప్పుడు మనిషి ఏదైతే అసాధ్యం అనుకున్నాడో దాన్ని సాధ్యం చేసి చూపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ ని AI నిజం చేసేస్తోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్, ఇండస్ట్రీస్, కస్టమర్ సపోర్ట్, ఎడ్యుకేషన్, ఇలా చాలా రంగాల్లో కూడా AIని వాడుకుంటూ పని చేసుకుంటున్నారు. అయితే కొన్ని రంగాల్లో AI ఎప్పటికీ ఉపయోగపడదని నిపుణులు తెలిపారు. వాటిల్లో క్రియేటివ్ ఆర్ట్స్, హ్యుమానిటీ, పరిశోధనా రంగం, లీగల్ సిస్టమ్, మెడికల్ సెక్టార్ వంటివి ఉన్నాయి.

కానీ ఇప్పుడు వైద్య రంగాన్ని కూడా ప్రభావితం చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతుంది. ఒక డాక్టర్ చేయాల్సిన పనిని వాట్సాప్ లోనే AI doctor చేసేస్తోంది. ఈ అద్భుతమైన ఫీచర్ ను ఇటీవలే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో ఫీచర్స్ చాలా అద్భుతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. దీన్ని ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ముందుగా ‘8738030604’ను సేవ్ చేసుకోవాలి.దీనిని AI Doctor అని సేవ్ చేసుకోవాలి. తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్ పై క్లిక్ చెయ్యండి. ఆ తరువాత చాట్ బాక్స్ లో హాయ్ అని టైప్ చేయండి.వెంటనే AI డాక్టర్ నుంచి మీ మెసేజికి రిప్లై వస్తుంది.

రిప్లై లో డాక్టర్ ఇచ్చిన సలహాలు, కండీషన్స్ జాగ్రత్తగా చదవండి. తరువాత మీ హెల్త్ ప్రాబ్లమ్ గురించి చెప్పండి. మీరు మెసేజీలా టైప్ చేసి చెప్పొచ్చు. లేదా వాయిస్ చాట్ ద్వారా కూడా AI డాక్టర్ తో మాట్లాడవచ్చు. మీరు ఎలా చాట్ చేసినా రిప్లై ఇస్తారు. కేవలం ఇవే కాదు ఇందులో ఇంకో సూపర్ ఫీచర్ కూడా ఉంది. మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్ లక్షణాలను ఫొటో తీసి కూడా పంపవచ్చు. ఆ ఫోటో చూసి మీ ప్రాబ్లమ్ కి పరిష్కారం ఇస్తారు. అంతేకాకుండా మీరు తీసుకోవాల్సిన మెడిసన్, ప్రికాషన్స్ గురించి చెప్తారు. అలాగే మీ మీ హెల్త్ ప్రాబ్లెమ్ కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఈ AI డాక్టర్ కి పంపించవచ్చు. వాటిని చెక్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్ తగ్గడానికి ఏం చేయాలో పరిష్కారం చూపిస్తారు. ఈ సూపర్ ఫీచర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.