iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD : ఆగని ఊచకోత.. వారం కాకుండానే కల్కి భారీ రికార్డ్స్.. 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

  • Published Jul 02, 2024 | 11:19 AM Updated Updated Jul 02, 2024 | 11:19 AM

Kalki 2898 AD 5th Day Collections: ఊహించినట్లుగానే.. ఊహకందని ఎన్నో ఎలెమెంట్స్ తో కల్కి ప్రపంచాన్ని సృష్టించాడు నాగ్ అశ్విన్. దీనితో ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇక ఈ క్రమంలో ఐదు రోజులు పూర్తయ్యే సరికి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..

Kalki 2898 AD 5th Day Collections: ఊహించినట్లుగానే.. ఊహకందని ఎన్నో ఎలెమెంట్స్ తో కల్కి ప్రపంచాన్ని సృష్టించాడు నాగ్ అశ్విన్. దీనితో ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇక ఈ క్రమంలో ఐదు రోజులు పూర్తయ్యే సరికి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..

  • Published Jul 02, 2024 | 11:19 AMUpdated Jul 02, 2024 | 11:19 AM
Kalki 2898 AD : ఆగని ఊచకోత.. వారం కాకుండానే కల్కి భారీ రికార్డ్స్.. 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

ఎంతో మంది ఎదురుచూపులకు తెరదించేలా.. జూన్ 27 న కల్కి సినిమాతో ప్రభంజనం సృష్టించాడు నాగ్ అశ్విన్. అసలు ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటినుంచి.. ట్రైలర్ రిలీజ్ చేసిన వరకు సినిమాపై.. ఒక్కొక్కరు ఎన్ని ఆశలు, ఊహాగానాలు పెట్టుకున్నారో.. వాటి అన్నిటిని కూడా.. తెరపైన చూపించి.. ప్రతి ఒక్కరు కాలర్ ఎగేరేసుకుని.. ఇది కదా సినిమా అంటే అనేలా చేశాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎక్కడ విన్న కల్కి సినిమా గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు మహాభారతం మీద అవహగానా లేని వాళ్లకు కూడా.. ఈ సినిమా ద్వారా మన పురాణాల గురించి తెలుసుకునేల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా అనుకున్నట్లుగానే 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలో ఐదు రోజులు పూర్తయ్యే సరికి కల్కి మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

ఇక రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన కల్కి 2898 ఏడీ మూవీ.. జూన్ 27న రిలీజ్ అయ్యి.. మొదటి రోజు రూ.191.5 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రెండ‌వ రోజు రూ.95.3 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి.. ఇక ఇప్పుడు లాభాల దిశగా అడుగులు వేస్తుంది. వీకెండ్ కలెక్షన్స్ ఒక ఎత్తైతే.. ఐదవ రోజు వర్కింగ్ డే అయినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ లోటు రానివ్వలేదు. 5వ రోజు కల్కి మూవీ ఇండియాలో రూ.343 కోట్ల నెట్ కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఐదవ రోజు తెలుగు కంటే కూడా హిందీలో ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. తెలుగులో కల్కి మూవీకి రూ.14.5 కోట్లు రాగా.. హిందీలో రూ.16.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ ఇలానే ఉంటే మాత్రం.. ఈ వీకెండ్ అయ్యే సమయానికి కల్కి సినిమా ఈజీగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Kalki 5 days Collections

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, శోభన కీలక పాత్రలు చేయగా.. దిశా పటాని, శోభన, అన్నా బెన్, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవీ, కేవీ అనుదీప్, అవసరాల శ్రీనివాస్, ఫరియా అబ్దుల్లాలు ఇలా దాదాపు ఇండస్ట్రీలో సగానికి సగం మంది నటి నటులంతా కూడా ఈ సినిమాలో కనిపించి.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. దీనితో జూన్ 27న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. అటు పబ్లిక్ లోను ఇటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లోను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ప్రభాస్ కి కొత్తేమి కాకపోయినా కూడా.. ఇంత తక్కువ సమయంలో.. 500 కోట్ల క్లబ్ లో చేరడం అనేది ఈ సినిమాకు మాత్రమే సాధ్యం అని చెప్పి తీరాలి. మరి కల్కి మూవీ కలెక్షన్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.