iDreamPost
android-app
ios-app

‘కల్కి’ ఇచ్చిన ధైర్యంతో సౌత్ మేకర్స్ అడుగులు.. ఇంక హాలీవుడే మన టార్గెట్!

  • Published Jul 17, 2024 | 1:58 PM Updated Updated Jul 17, 2024 | 1:58 PM

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్​తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్​కు కూడా లాభాల పంట పండించిందీ చిత్రం.

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్​తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్​కు కూడా లాభాల పంట పండించిందీ చిత్రం.

  • Published Jul 17, 2024 | 1:58 PMUpdated Jul 17, 2024 | 1:58 PM
‘కల్కి’ ఇచ్చిన ధైర్యంతో సౌత్ మేకర్స్ అడుగులు.. ఇంక హాలీవుడే మన టార్గెట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్​తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్​కు లాభాల పంట పండించిందీ చిత్రం. మూడో సినిమాతోనే పాన్ ఇండియా హిట్​ను అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి’ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ.. ఇలా రిలీజైన ప్రతి చోట బంపర్ హిట్​గా నిలిచింది. రిలీజై రెండు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగా రన్​ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.1,000 కోట్ల మార్క్​ను అధిగమించిన ఈ బ్లాక్​బస్టర్ ఫిల్మ్.. ఫుల్ రన్ ముగిసేసరికి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ అనేది ఏ ఒక్క వ్యక్తికో లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయాల్సిన విషయం కాదు. ఈ చిత్రం విషయంలో టాలీవుడ్ మేకర్స్, యాక్టర్స్, ఫ్యాన్స్ ఎంతో గర్వపడుతున్నారు. అయితే ‘కల్కి’ విజయం ఇప్పుడు సౌత్ మేకర్స్​లో కొంగొత్త ఆశల్ని పుట్టిస్తోందని గ్రహించాలి. ఇన్నాళ్లూ బాలీవుడ్​పై దండయాత్ర చేసి.. పాన్ ఇండియా మార్కెట్​ను కైవసం చేసుకున్న ఇక్కడి హీరోలు, దర్శకులు.. ఇప్పుడు ఏకంగా మిషన్ హాలీవుడ్​కు రెడీ అవుతున్నారు. అప్పట్లో ‘బాహుబలి’ స్ఫూర్తితో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం పెరిగింది. వెయ్యి కాదు.. సరిగ్గా ప్లాన్ చేసి ఆడియెన్స్​ను సీట్లకు కట్టిపడేసేలా సినిమాలు తీస్తే రెండు వేల కోట్లు కూడా కొట్టొచ్చనే ధైర్యం అందరిలో వచ్చింది.

దర్శక ధీరుడు రాజమౌళి వేసిన దారిలో పయనిస్తూ ఎన్నో సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్​లో హ్యూజ్ సక్సెస్ చూశాయి. ‘పుష్ప’ నుంచి ‘కాంతార’ వరకు దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లతో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీస్​కు టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’తో నాగ్ అశ్విన్ అందరిలోనూ స్ఫూర్తి నింపాడు. సరైన కంటెంట్​, విజువల్ ఎఫెక్ట్స్​తో సినిమాలు తీస్తే మూవీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చూపించాడు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ లాంటి వేర్వేరు జోనర్లను కలిపి సైఫై అనే కొత్త జానర్​ను పరిచయం చేశాడు. ఈ జోనర్​ను పట్టుకుంటే పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అన్ని రకాల ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పించొచ్చని ప్రూవ్ చేశాడు. దీంతో ఇదే బాటలో పయనించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు క్రేజీ సౌత్ మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి.. మిషన్ హాలీవుడ్​లో మనోళ్లు ఎంత వరకు సక్సెస్ అవుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.