Nidhan
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. మూడో సినిమాతోనే ఏకంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. మూడో సినిమాతోనే ఏకంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Nidhan
‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. మూడో సినిమాతోనే ఏకంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించిన ‘కల్కి’ ఇంకా గ్రాండ్ రన్‌ను కొనసాగిస్తోంది. రిలీజై రెండు వారాలు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’కు డివైడ్ టాక్ రావడంతో ‘కల్కి’కి పోటీ లేకుండా పోయింది. ఇప్పట్లో భారీ సినిమాలు లేకపోవడంతో ప్రభాస్ ఫిల్మ్ వసూళ్ల ఊచకోత మరికొన్ని రోజులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ‘బాహుబలి 2’ తర్వాత ఆయనకు మళ్లీ ఆ రేంజ్ హిట్ పడటం, వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రెండోసారి అడుగుపెట్టడంతో రెబల్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
హ్యూజ్ బడ్జెట్‌తో సినిమా తీయడం, ఏళ్ల పాటు కష్టపడటంతో ‘కల్కి’ రిజల్ట్ కాస్త తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుందని డైరెక్టర్ నాగీ భయపడ్డారు. కానీ ఆడియెన్స్ మూవీని నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్నారు. దీంతో పాటు ఎక్కడ చూసినా మహాభారతం, కర్ణుడు-అర్జునుడు, కలి పురుషుడు, కల్కి అవతారం గురించి మాట్లాడుతుండటంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పురాణాలు, ఇతిహాసాల గురించి పెద్దగా తెలియని ఈ జనరేషన్‌కు వాటి గురించి తెలుసుకునేలా, చర్చించేలా చేయడం అంటే వందల కోట్ల వసూళ్ల కంటే బిగ్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి. ఇక, ‘కల్కి’ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకోవడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. హింస లేకుండా మూవీ తీసి హిట్ కొట్టామంటూ వాళ్లకు ఓ రేంజ్లో గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేశారు.
‘ఈ మైల్స్టోన్.. ఈ నంబర్స్.. మా యంగ్ టీమ్‌కు ఎంతో ముఖ్యం. ఇవి మాకు ఇచ్చిన బలం అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే.. మేం ఇంత అద్భుత విజయాన్ని ఎలాంటి హింస, రక్తపాతం, అశ్లీలత, రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా సాధించాం. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రేక్షకులు, నటులకు కృతజ్ఞతలు. ఇదీ ఇండియన్ సినిమా అంటే’ అని నాగ్ అశ్విన్ పోస్ట్ పెట్టారు. ఆఖర్లో రేపటి కోసమంటూ ‘కల్కి’ మూవీలో ఫేమస్ అయిన డైలాగ్‌ను క్యాప్షన్‌గా జతచేశారు. దీంతో అసలు నాగీ కౌంటర్ ఎవరికంటూ ఆడియెన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా ఎవరో ఒకరికి కాకుండా.. హింస, రక్తపాతం, అశ్లీలతతో సినిమాలు తీసే మేకర్స్‌ను టార్గెట్ చేసుకొనే ఆయన ఇలా స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హింస లేకుండా మూవీ తీశానంటూ నాగీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
@imvangasandeep pic.twitter.com/6qmIcAhrg6
— PadmaSri (@IamPadmaSri) July 13, 2024