iDreamPost
android-app
ios-app

అసిస్టెంట్ డైరెక్టర్ నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చి చొక్కా విప్పాడు.. ఆపై: కాజల్‌

  • Published May 21, 2024 | 7:26 PM Updated Updated May 21, 2024 | 7:26 PM

షూటింగ్ లో గ్యాప్ దొరికితే హీరోలు, హీరోయిన్లు వ్యానిటీ వ్యాన్ లో రిలాక్స్ అవుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్ లో గ్యాప్ దొరికిందని వ్యానిటీ వ్యాన్ లో రిలాక్స్ అవుతుందట. ఈ క్రమంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి తన ముందే షర్ట్ విప్పి..

షూటింగ్ లో గ్యాప్ దొరికితే హీరోలు, హీరోయిన్లు వ్యానిటీ వ్యాన్ లో రిలాక్స్ అవుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్ లో గ్యాప్ దొరికిందని వ్యానిటీ వ్యాన్ లో రిలాక్స్ అవుతుందట. ఈ క్రమంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి తన ముందే షర్ట్ విప్పి..

  • Published May 21, 2024 | 7:26 PMUpdated May 21, 2024 | 7:26 PM
అసిస్టెంట్ డైరెక్టర్ నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చి చొక్కా విప్పాడు.. ఆపై: కాజల్‌

సినిమా హీరోలకి, హీరోయిన్స్ కి క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే మీద పడిపోతారు. కొన్ని సందర్భాల్లో ఆ అభిమానం హద్దు  మీరుతుంటుంది. హీరోయిన్స్ విషయంలో అయితే మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాకరాని చోట తాకడం.. శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడం వంటివి చేస్తుంటారు. అభిమానం పేరుతో చేసే పనులకు పాపం హీరోయిన్స్ నలిగిపోతుంటారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి, ఏదైనా ఈవెంట్ కి రావాలంటేనే భయపడుతూ వస్తుంటారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా గతంలో ఒక అభిమాని విషయంలో భయపడినట్లు తెలిపింది. అతని ప్రవర్తనకు భయపడి చచ్చా అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో కాజల్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది టాలీవుడ్ చందమామ. కొన్నాళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్నా అని.. అయితే తొలిరోజు షూటింగ్ పూర్తయ్యాక వ్యానిటీ వ్యాన్ లో కూర్చున్నా అని తెలిపింది. ఆ సమయంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్.. అనుమతి లేకుండా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చాడని తెలిపింది. రావడం రావడమే షర్ట్ విప్పి అతని ఛాతీ మీద ఉన్న ఒక టాటూని చూపించాడని వెల్లడించింది. అయితే అతను చూపించింది తన పేరుతో ఉన్న టాటూ అని.. ఆ సమయంలో అతను అలా చేయడంతో భయపడ్డా అని పేర్కొంది.

తనపై ఉన్న అభిమానాన్ని టాటూ రూపంలో ప్రదర్శించినందుకు సంతోషంగా ఉన్నా గానీ అలా ప్రవర్తించడమే కరెక్ట్ కాదని అతన్ని హెచ్చరించానని కాజల్ తెలిపింది. ఇదిలా ఉంటే కాజల్ నటించిన సత్యభామ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ సరసన నవీన్ చంద్ర నటించగా.. ప్రకాష్ రాజ్, నాగినీడు, రవివర్మ, హర్షవర్ధన్ లు కీలక పాత్రల్లో నటించారు. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో కాజల్ అంచనాలు పెంచేసింది. మరి పోలీస్ ఆఫీసర్ రోల్ లో సత్యభామగా కాజల్ తన పెర్ఫార్మెన్స్ తో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.  

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom