iDreamPost
android-app
ios-app

వెంటిలేటర్‌పై నటుడు.. కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయం!

  • Published Jan 12, 2024 | 5:38 PM Updated Updated Jan 12, 2024 | 5:38 PM

కాదంబరి కిరణ్‌ కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటి పావలా శ్యామలను కలిశారు. ఆమె పరిస్థితి మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

కాదంబరి కిరణ్‌ కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటి పావలా శ్యామలను కలిశారు. ఆమె పరిస్థితి మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

  • Published Jan 12, 2024 | 5:38 PMUpdated Jan 12, 2024 | 5:38 PM
వెంటిలేటర్‌పై నటుడు.. కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయం!

కాదంబరి కిరణ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. నటన, దర్శకత్వం, రచనలో తనవంతు కృషి చేస్తున్నారు. కేవలం సినిమాల విషయంలోనే కాదు.. సేవా కార్యక్రమాల విషయంలోనూ కాదంబరి కిరణ్‌ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎంతో గొప్ప మనసుతో అవసరం ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. మనం సైతం అనే ఫౌండేషన్‌ను మొదలుపెట్టి.. చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులకు నటులకు సాయం చేస్తున్నారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె దగ్గరకు వెళ్లిన ఆయన 25వేల రూపాయల చెక్కును అందజేశారు.  తన ఫౌండేషన్‌ తరపున ఈ సాయం చేశారు. ఇప్పుడు మరో నటుడికి కూడా కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయం చేశారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌ మీద ఉన్న ఆ నటుడి వైద్య ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చారు. ఇంతకీ సంగతేంటంటే.. ప్రముఖ నటుడు వీరభద్రయ్య కొద్దిరోజుల క్రితం ప్రమాదానికి గురయ్యారు.

ఆ ప్రమాదం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కుటుంబసభ్యులు ఆయనకు వైద్యం చేయించడానికి తగినంత డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని కాదంబరి కిరణ్‌కు తెలిసింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వీరభద్రయ్య కుటుంబసభ్యుల్ని కలుసుకున్నారు. దాదాపు 25 వేల రూపాయల చెక్కును వారికి అందించారు.

వీరభద్రయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధీన స్థితిలో ఉన్న సినీ పరిశ్రమకు చెందిన వారిని కాదంబరి కిరణ్‌ ఆదుకోవటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో సైతం ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, కాదంబరి కిరణ్‌ ‘అమ్మా నాన్న ఓ తమిళ అ‍మ్మాయి’ సినిమాలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి, అనారోగ్యంతో ఉన్న నటుడు వీరభద్రయ్య వైద్య ఖర్చుల కోసం కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయం అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet