iDreamPost
android-app
ios-app

వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు బాధ్యత వహిస్తావా.. సమంతపై హీరోయిన్స్ సీరియస్..

  • Published Jul 07, 2024 | 7:00 AM Updated Updated Jul 07, 2024 | 7:00 AM

Tollywood Heroines Serious On Samantha: సమంత ఇటీవల తన ఫాలోవర్స్ కి హెల్త్ చిట్కాను షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు వైద్య నిపుణులు విమర్శలు చేస్తుండగా.. తాజాగా ఐదారు టాలీవుడ్ హీరోయిన్స్ సీరియస్ అయ్యారు.

Tollywood Heroines Serious On Samantha: సమంత ఇటీవల తన ఫాలోవర్స్ కి హెల్త్ చిట్కాను షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు వైద్య నిపుణులు విమర్శలు చేస్తుండగా.. తాజాగా ఐదారు టాలీవుడ్ హీరోయిన్స్ సీరియస్ అయ్యారు.

  • Published Jul 07, 2024 | 7:00 AMUpdated Jul 07, 2024 | 7:00 AM
వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు బాధ్యత వహిస్తావా.. సమంతపై హీరోయిన్స్ సీరియస్..

సమంతపై టాలీవుడ్ హీరోయిన్స్ సీరియస్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన హెల్త్ టిప్ వివాదానికి కారణమైంది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ తనకు బాగా పని చేసిందని.. మిగతా మెడిసిన్స్ ని పక్కన పడేయండి అంటూ ఆమె ఒక ఆరోగ్య చిట్కా చెప్పుకొచ్చింది. అయితే దీనిపై పలువురు విమర్శలు చేస్తుండగా.. కొంతమంది సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ నటి, బ్యాడ్మింటన్ ప్లేయర్ సమంతపై విమర్శలు చేయగా.. ఆమెకు మద్దతుగా మరో టాలీవుడ్ హీరోయిన్ నిలిచారు.  

సమంత షేర్ చేసిన చిట్కాను పలువురు డాక్టర్లు తప్పుబడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సమంతకు ఏమీ తెలియదని.. ఆమెను జైల్లో పెట్టాలని ప్రముఖ వైద్యుడు సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అన్నారు. అయితే ఈ డాక్టర్ కామెంట్స్ కి సమంత అంతే స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. తాజాగా సమంతపై నటి, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా కామెంట్స్ చేశారు. ‘భారీ సంఖ్యలో ఆమెను ఫాలో అవుతున్న అభిమానులకు ఆరోగ్య చిట్కాలు ఇస్తున్న సెలబ్రిటీని నేను ఒకటే ప్రశ్న అడగదలచుకున్నా.. సాయం చేయాలన్న మీ ఉద్దేశం మంచిదే. కానీ ఒకవేళ నువ్వు ఇచ్చిన చిట్కా వల్ల సహాయం జరగకపోగా.. ఎవరి ప్రాణానికైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు ట్యాగ్ చేసిన డాక్టర్ ఏమైనా బాధ్యత వహిస్తారా?’ అంటూ జ్వాలా గుత్తా సమంతపై కామెంట్స్ చేశారు.

అయితే జ్వాలా గుత్తా చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ‘ఇది తమను తాము సమాజంలో మంచిగా ప్రాజెక్ట్ చేసుకోవడంలో భాగమే జ్వాలా. వీళ్ళు చేసే ప్రకటనల వెనుక చీకటి కోణం. చాలా మంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు. కానీ వాళ్ళు చేసే యాడ్స్ లో కూల్ డ్రింక్ లు, చాక్లెట్లు తీసుకోమని ప్రజలకు చెప్తారు. ఇది డార్క్ రియాలిటీ; అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. దీంతో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet